ఐపీఎస్ ల మీద వేటు: సీబీఐ చేతికి సింగిల్ నెంబర్ లాటరీ
బెంగళూరు: వేల కోట్ల రూపాయల సింగిల్ నెంబర్ లాటరీ స్కాం కేసు చివరికి సీబీఐ కోర్టులోకి వెళ్లింది. ఈ లాటరీ స్కాం కుంబకోణం కేసు సీబీఐకి అప్పగిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విధాన సౌధలో విలేకరులతో మాట్లాడారు.
సింగిల్ నెంబర్ లాటరీ కేసులో ఐపీఎస్ అధికారులు, సుమారు 50 మంది పోలీసు అధికారులకు నేరుగా ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ సిద్దరాయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశాయి.
కేసు సీబీఐకి అప్పగించాలని గవర్నర్ కు మనవి చేశారు. ఇదే సందర్బంలో బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్, మరొ సీనియర్ ఐపీఎస్ అధికారి దరణేష్ లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పోలీసు అధికారుల మీద నేరుగా ఆరోపణలు రావడంతో గవర్నర్ వాజుభాయ్ వాల ఈ కేసు విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. సింగల్ నెంబర్ లాటరీ స్కాం ప్రధాన నిందితుడు హరిరాజన్ తో మరొ 40 మంది పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.
అనారోగ్యంతో బాధపడుతున్న హరిరాజన్ ను కోలారు జిల్లా బంగారుపేట జైలు నుండి బెంగళూరు లోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఈ కేసు దర్యాప్తు సీఐడి అధికారులు చేస్తున్నారు. అయితే కేసు దర్యాప్తును సీబీఐ కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2007 మార్చి 27వ తేదిన కర్ణాటక ప్రభుత్వం లాటరీని నిషేధించింది. అయితే అప్పటి నుండి హరిరాజన్ పోలీసు అధికారులతో సంబంధాలు పెట్టుకుని రూ. కోన్ని వేల కోట్ల లాటరీ స్కాం చేశాడని పోలీసులు ఆధారాలు సేకరించారు. పోలీసు అధికారులు ఇతని తో నేరుగా సంబంధాలు పెట్టుకున్నారని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications