Bullet Train: గుడ్ న్యూస్.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడగు!
Bullet Train: దేశంలో మొదటి బుల్లెట్ రైలును నడపడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం వందల కిలోమీటర్ల ట్రాక్ పూర్తవుతుండగా.. ఈ రైలు ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, శిల్‌ఫాటా మధ్య ఒక పొడవైన సొరంగం గుండా కూడా వెళ్తుంది. ఈ సొరంగంలో ఒక భాగం నిర్మాణం పూర్తయింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రపు టన్నెల్ నిర్మాణంలో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొంది. అంతే కాకుండా 310 కిలోమీటర్ల పైవంతెన నిర్మాణాన్ని కూడా పూర్తి చేసినట్లు వెల్లడించింది. భారతీయ రైల్వే దీనిని పెద్ద విజయంగా అభివర్ణించింది.
దీనితో పాటు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త E10 షింకన్‌సేన్ రైళ్లను చేర్చడానికి జపాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 508 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టు భారత్, జపాన్ మధ్య ఒక ముఖ్యమైన భాగస్వామ్యం. ఈ ప్రాజెక్టు పూర్తికావడం దేశంలో భవిష్యత్తులో నిర్మించబడే బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు విజయం దేశంలో భవిష్యత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు పునాది వేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొనబడింది. ఇతర కారిడార్లను కూడా చురుకుగా పరిశీలిస్తున్నారు.
ముమ్మరంగా నిర్మాణ పనులు
రైల్వే మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ట్రాక్‌లను వేయడం, ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలను నిర్మించడం, స్టేషన్లు, వంతెనల పని వేగంగా జరుగుతోందని పేర్కొంది. మహారాష్ట్రలో కూడా నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అలాగే ఆపరేషన్, నియంత్రణ వ్యవస్థల కొనుగోలు ప్రక్రియ కూడా సజావుగా జరుగుతోంది.ప్రభుత్వ సమాచారం ప్రకారం, భారతదేశం, జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం జపాన్‌లో నడుస్తున్న E5 షింకన్‌సేన్ రైళ్లను మించిన నూతన తరం E10 రైళ్లు భారత బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో నడిచేలా జపాన్ అంగీకరించిందని వెల్లడించింది. మొత్తం 508 కిలోమీటర్ల ప్రాజెక్టు జపాన్ షింకన్‌సేన్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చెందుతోంది.

15 వంతెనల పని పూర్తి
E10 రైళ్లు భారత్, జపాన్‌లో ఒకేసారి ప్రారంభించడం గమనార్హం. ఈ ప్రాజెక్టు కింద నదిపై నిర్మించబడుతున్న 15 వంతెనల పని పూర్తియిందని.. అయితే నాలుగు వంతెనల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 12 స్టేషన్లలో 5 స్టేషన్ల పని పూర్తయింది. మరో 3 స్టేషన్ల పని ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. బీకేసీ స్టేషన్ ఇంజనీరింగ్ అద్భుతంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ స్టేషన్ భూమికి 32.5 మీటర్ల కింద ఉంటుంది. దీని పునాది దానిపై 95 మీటర్ల ఎత్తైన భవనాన్ని నిర్మించడానికి వీలుగా రూపొందించబడింది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications