మోడీ ఎఫెక్ట్: యూఏఈలో దావూద్ ఇబ్రహీంకు షాక్, రూ.15 వందల కోట్లు స్వాధీనం
ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. దావూద్ ఇబ్రహీంకు భారత, పాకిస్తాన్‌లతో పాటు దుబాయ్, మొరాకో, స్పెయిన్, థాయ్‌లాండ్, సైప్రస్, టర్కీ తదితర దేశాల్లో ఆస్తున్నాయి.
దుబాయ్‌లోని రూ.15,000 కోట్ల ఆస్తులను యూఏఈ ప్రభుత్వం మంగళవారం నాడు స్వాధీనం చేసుకుంది.

గత ఏడాది దుబాయ్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లు.. దావూద్‌కు చెందిన అక్రమాస్తుల వివరాలు అక్కడి ప్రభుత్వానికి అందించారు. దీనిపై దర్యాఫ్తు జరిపిన యూఏఈ.. దావూద్‌కు చెందిన గోల్డెన్ బాక్స్ కంపెనీ ఆస్తులు, షేర్లతో పాటు పలు హోటల్స్ స్వాధీనం చేసుకుంది.












Click it and Unblock the Notifications