Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముంబైలో ఘోర పడవ ప్రమాదం: 13 మంది మృతి, పలువురు గల్లంతు

ముంబై సముద్ర తీరంలో బుధవారం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణికులతో వెళ్తోన్న ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారని, 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వెల్లడించారు.

కాగా, ఈ ఘటన ఫెర్రీని స్పీడ్ బోటు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరికొందరి ఆచూకీ లభ్యం కాలేదని, వారికోసం గాలింపు కొనసాగుతోందని దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Mumbai Boat Tragedy 13 Dead As Ferry Carrying Tourists Capsizes Near Gateway Of India

'గేట్ వే ఆఫ్ ఇండియా' నుంచి ఎలిఫెంటా గుహలకు 'నీల్‌కమల్' అనే ఫెర్రీ.. 110 మందికిపైగా పర్యటకులతో బయల్దేరింది. అయితే, చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన ఓ చిన్న బోటు దాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ మునిగిపోయింది. దీంతో తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు.

వెంటనే స్పందించిన రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. 101 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. అయితే, అప్పటికే లైఫ్ జాకెట్లు కాపాడలేకపోవడంతో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. కాగా, ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


'ఎలిఫెంటా ద్వీపానికి వెళ్లే మార్గంలో నీల్కమల్ పడవ ప్రమాదానికి గురైందని మాకు సమాచారం అందింది. నేవీ, కోస్ట్ గార్డ్, పోర్ట్, పోలీసు బృందాల నుంచి రెస్క్యూ బోట్‌లను వెంటనే పంపించారు. మేము జిల్లా, పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉన్నాం. చాలా మంది ప్రయాణీకులను కాపాడటం జరిగింది. అయితే రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ప్రయత్నాల కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించమని జిల్లా అధికారులకు సూచించాం' అని సీఎం ఫడ్నవీస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+