సముద్రంలో కలిసిపోనున్న విశాఖ, ముంబైతోపాటు 12 నగరాలు, 2050 నుంచి కౌంట్‌డౌన్ స్టార్ట్

న్యూఢిల్లీ: వాతావరణ మార్పుపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్(ఐపీసీసీ) భారతదేశానికి తీవ్ర హెచ్చరికలు చేసింది. దేశంలో ఊహించని విధంగా వాతావరణ మార్పులు చేసుకోనున్నాయని తెలిపింది. సముద్రపు జలాలు భారీ స్థాయిలో పెరిగిపోయి దేశంలోని 12 కీలక తీరప్రాంత పట్టణాలను ముంచుతాయని హెచ్చరించింది.

దేశంలోని 12 నగరాలు సముద్రపు నీటిలోకి..

దేశంలోని 12 నగరాలు సముద్రపు నీటిలోకి..

ఈ శతాబ్దపు చివరి నాటికి ఆ 12 నగరాలు దాదాపు 3 ఫీట్లమేర నీటిలో మునిగిపోనున్నాయని వాతావరణ మార్పు నివేదిక హెచ్చరించింది. సముద్రపు నీటిలో మునిగిపోనున్న ఈ నగరాల్లో ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సముద్రపు మట్టాల మార్పులపై అధ్యయనం చేసే ఐపీసీసీ.. నాసా పరిశీలన తర్వాత ఈ నివేదికను వెల్లడించింది. భారతదేశంలోని 12 తీర ప్రాంత నగరాలు సముద్రపు నీటిలో మునిగిపోతాయని నాసా తెలిపింది.

గత వందేళ్ల చూడని విధంగా సముద్ర మట్టాల్లో పెరుగుదల

గత వందేళ్ల చూడని విధంగా సముద్ర మట్టాల్లో పెరుగుదల

కాగా, 1988 నుంచి ఐపీసీసీ ప్రతి ఐదేళ్లు నుంచి ఏడేళ్లకొకసారి భూమిపై వాతావరణ మార్పులను నివేదికలను అందిస్తోంది. ఉష్ణోగ్రత, మంచు పరిధి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు, భూమిపై సముద్రపు మట్టాల గురించిన విషయాలు వెల్లడిస్తుంది. గ్లోబల్ రేటు కంటే ఆసియాలోనే సముద్రపు మట్టాల పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోందని ఐపీసీసీ తెలిపింది. గత వందేళ్లలో చూడని విధంగా సముద్రపు మట్టాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఐపీసీసీ నివేదిక వెల్లడిస్తోంది. సముద్రపు మట్టాల్లో అనుకున్నదానికంటే ఎక్కువ పెరుగుదల నమోదవుతోందని పేర్కొంది. 2050 తర్వాత నుంచి ప్రతి ఆరు నుంచి తొమ్మిదేళ్లలోనే సముద్రపు మట్టాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది.

శతాబ్దం ముగిసేనాటికి చాలా నగరాల సముద్ర మట్టాల్లో పెరుగుదల

శతాబ్దం ముగిసేనాటికి చాలా నగరాల సముద్ర మట్టాల్లో పెరుగుదల


21వ శతాబ్దం మొత్తంలో కూడా సముద్రపు మట్టాలు పెరుగుతూనే ఉన్నాయి. గత వందేళ్లలో చోటు చేసుకున్న దాని కంటే సముద్ర తీర ప్రాంతాల్లో నీటి మట్టం ఊహించని విధంగా పెరుగుతోంది. ఈ శతాబ్దం ముగిసేనాటికి చాలా నగరాలు నీటిలో మునిగిపోతాయని ఐపీసీసీ వర్కింగ్ ప్రూప్ 1 రిపోర్ట్ పేర్కొంది. అనేక ప్రాంతాల్లో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీంతో మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని పేర్కొంది.

ఈ శతాబ్దం చివరినాటికి 12 నగరాలు సముద్రంలోకి.

ఈ శతాబ్దం చివరినాటికి 12 నగరాలు సముద్రంలోకి.

2006, 2008 అంచనాల ప్రకారం.. ప్రతి సంవత్సరం సముద్ర మట్టం 3.7 మిల్లిమీటర్ల మేర పెరుగుతూ వస్తోంది. హిందు కుష్ హిమాలయాలలో హిమానీనదాలు తగ్గుకుంటూ వస్తున్నాయి. మంచు పర్వతాలు ఎత్తు క్షీణిస్తోంది. 21వ శతాబ్ధం ప్రారంభం నుంచి హిందూకుష్ హిమాలయాల్లోని హిమానీనదాలు కరుగుతున్నాయని, పర్వతాల ఎత్తు కూడా తగ్గిపోతోందని రిపోర్టు ఆథర్ కృష్ణ అచ్యుతరావు తెలిపారు. 1970 నుంచి హిమానీనదాలు కరిగిపోతున్నాయిన చెప్పారు. సముద్ర మట్టాలు పెరగడంతో భారతదేశంలోని 12 ప్రధాన నగరాలు తీవ్ర ప్రభావానికి లోనుకానున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు కరగడం, వాతామార్పులు ఇలాగే కొనసాగితే.. ఈ శతాబ్దం చివరి నాటికి ఈ నగరాల్లో మూడు ఫీట్ల సముద్రపు నీటితో మునిగిపోనున్నాయి.
భారతదేశంలోని 12 నగరాలు:
కండ్ల: 1.87 అడుగులు
ఓఖా: 1.96 అడుగులు
భౌనగర్: 2.70 అడుగులు
ముంబై: 1.90 అడుగులు
మోర్ముగావ్: 2.06 అడుగులు
మంగళూరు: 1.87 అడుగులు
కొచ్చిన్: 2.32 అడుగులు
పారాదీప్: 1.93 అడుగులు
ఖిదీర్‌పూర్: 0.49 అడుగులు
విశాఖపట్నం: 1.77 అడుగులు
చెన్నై: 1.87 అడుగులు
ట్యూటికోరిన్: 1.9 అడుగులు

వాతావరణ మార్పులతో బిలియన్ మంది ప్రజలపై ప్రభావం..

వాతావరణ మార్పులతో బిలియన్ మంది ప్రజలపై ప్రభావం..

హిమాలయాలలో హిమానీనదాల నిరంతర ద్రవీభవనతో సముద్ర మట్టాలు పెరుగుతుండగా.. ఇది ఈ వనరులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడిన ఒక బిలియన్ మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
హిమాలయ కారకోరం ప్రాంతంలోని హిమనీనదాల హైడ్రాలజీపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఇండోర్ మునుపటి నివేదిక ప్రకారం.. గంగా, బ్రహ్మపుత్ర బేసిన్‌ల కంటే సింధుకు హిమాలయ కారకోరం నదులలో హిమానీనదాలు, మంచు కరుగుతున్న ముఖ్యమైన భాగాలు అని చూపించింది. మొత్తం నదీ ప్రవాహం, హిమానీనదం కరిగిపోవడం, ప్రవాహం కాలానుగుణత 2050 వరకు పెరుగుతాయి, ఆపై తగ్గుతాయని బృందం అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+