అర్నబ్ గోస్వామిపై ముంబై డీసీపీ పరువు నష్టం దావా
ముంబై: అర్బన్ గోస్వామిపై పరువు నష్టం దావా దాఖలైంది. ముంబై IX జోన్ డిప్యూటీ కమిషనర్.. జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి, అతని భార్య సమ్యబ్రత రే గోస్వామి, రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ యజమాని ఏఆర్జీ మీడియా పీవీటీ లిమిటెడ్ పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరువు నష్టం పిటిషన్ జోన్ IX డిప్యూటీ కమిషనర్ అభిషేక్ త్రిముఖే పేరు మీద దాఖలైంది.

జూన్ 14న రాజ్‌పుత్ మరణాన్ని బాంద్రా పోలీస్ స్టేషన్ పోలీసులు విచారించారు. నటుడు సుశాంత్ తన బాంద్రా ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా పరువు నష్టం ఫిర్యాదు సమర్పించడం జరిగింది. కాగా, 'మహారాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ ఫిర్యాదుదారునికి మంజూరు చేసినందుకు అనుగుణంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తక్షణ ఫిర్యాదు దాఖలు చేశారు' అని తెలిపారు.
కాగా, అక్టోబర్ 23 న మంజూరు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టానికి సంబంధించిన నేరాలకు భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదు సమర్పించబడింది.












Click it and Unblock the Notifications