వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4500 మంది వైద్యుల సామూహిక సెలవు... అల్లాడుతున్న రోగులు

తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహారాష్ట్ర వ్యాప్తంగా 4,500 మంది ప్రభుత్వ వైద్యులు సామూహిక సెలవులు పెట్టారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహారాష్ట్ర వ్యాప్తంగా 4,500 మంది ప్రభుత్వ వైద్యులు సామూహిక సెలవులు పెట్టారు. బాంబే హైకోర్టు సమ్మెకు అనుమతి నిరాకరించడంతో వీరంతా గుట్టుచప్పుడు కాకుండా సెలవులు పెట్టేశారు.

వారం రోజులుగా వీరు విధులకు హాజరు కావడం లేదు. వైద్యులు సెలవుల్లో ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అల్లాడిపోతున్నారు. అవుట్ పేషెంట్ విభాగంలో రద్దీ విపరీతంగా పెరగడంతో సీనియర్ వైద్యులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లను ప్రభుత్వం పిలిపించింది.

Mumbai doctors' strike: 4,000 medicos go on mass leave protesting attacks by patients' kin

మరోవైపు మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్(ఎంఏఆర్‌డీ), మెడికల్ కాలేజ్ డీన్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ముంబైలో మేయర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైద్యులకు భద్రత కల్పించాలని కోరారు.

సియోన్ ఆస్పత్రిలో ఓ రోగి చికిత్స పొందుతూ చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ అతడి బంధువులు వైద్యుడిపై దాడి చేశారు. అక్కడ 25 మంది సెక్యూరిటీ గార్డులను నియమించాల్సి ఉంది.

రోగుల బంధువుల దాడుల పెరిగిపోతున్నాయని, వారి నుంచి భద్రత పెంచాలని డిమాండ్ చేస్తూ వైద్యులు సామూహిక సెలవులు పెట్టారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

English summary
Mumbai: Medical services in 17 government hospitals were disrupted on Monday when over 4,500 resident doctors went on a mass casual leave to protest growing incidents of attacks by patients' relatives.There have been at least five attacks on resident doctors in one week, including two in the past 24 hours, said Indian Medical Association (Youth) state President Sagar Mundada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X