Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోటి మందిని చంపుతాం.. గణపతి నిమజ్జనం వేళ మహానగరంలో హైఅలర్ట్!

ముంబై మహానగరం మరోసారి ఉలిక్కిపడింది. ఇటీవల ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్‌కు వచ్చిన ఒక సంచలనాత్మక ఫోన్ కాల్ మహానగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాల్ చేసిన వ్యక్తి మొత్తం 34 కార్లలో 400 కిలోల ఆర్డీఎక్స్(RDX)తో నిండిన 34 'మానవ బాంబులు' ఉన్నాయని, అవి నగరాన్ని పూర్తిగా నాశనం చేసేలా భారీ పేలుళ్లకు సిద్ధంగా ఉన్నాయని బెదిరించాడు. ఈ సమాచారంతో ముంబై పోలీసులు వెంటనే అప్రమత్తమై ముంబైలో హై-అలర్ట్ ప్రకటించారు.

లష్కర్-ఎ-జిహాది పేరుతో బెదిరింపులు
ఈ బెదిరింపు కాల్‌ "లష్కర్-ఎ-జిహాది" అనే సంస్థ నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు. ఈ బెదిరింపులు ముఖ్యంగా అనంత్ చతుర్దశి నాడు రావడం ఆందోళన కలిగించింది. 34 కార్లలో మానవ బాంబులు పేలితే కోటి మందికి పైగా చనిపోతారని బెదిరింపు సందేశంలో ఉంది. ఈ బెదిరింపు కాల్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పెంచారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన పర్యాటక ప్రదేశాలు, జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్ల గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.

Mumbai Panic 34 Human Bombs 400 Kg RDX Threat Shocks City

ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు..
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇలాంటి తప్పుడు బెదిరింపులు ముంబైకి కొత్తేమీ కాదు. గత కొద్ది నెలలుగా ఇలాంటి ఘటనలు చాలానే నమోదయ్యాయి. ఈ నివేదికలు నగర భద్రతకు ఒక సవాలుగా మారాయి. గత సోమవారం మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక రైల్వే స్టేషన్ ను పేల్చివేస్తానని బెదిరించినందుకు రూపేష్ మధుకర్ రాంపిసే అనే 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతను పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి, కల్వా రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టానని చెప్పాడు. కానీ తనిఖీల తర్వాత అది ఒక తప్పుడు సమాచారమని తేలింది.

ఇస్కాన్ ఆలయానికి బెదిరింపు: ఆగస్టులో ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా.. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఇది ఒక ఫేక్ ఈమెయిల్ అని తర్వాత నిర్ధారించారు.

విమానాశ్రయానికి బెదిరింపు: జులై 25న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని టెర్మినల్-2లో బాంబు పేలుడు జరుగుతుందని ముంబై పోలీసులకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్టు మొత్తాన్ని తనిఖీ చేశారు. కానీ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో ముంబై పోలీసులు బెదిరింపు కాల్స్ చేసే వారిపై నిఘా పెంచారు. తప్పుడు సమాచారంతో ప్రజలను భయపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+