బంగారం చోరీ చేసిన ఎలుకలు.. పోలీసులు అపసోపాలు..
ముంబై: సాధారణంగా దొంగలు బంగారం దోచుకెళ్లడం సహజం.. కానీ ఇక్కడ ఓ ఎలుక 5లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లింది. దీంతో బాధితురాలు పోలీసులకు కంప్లైట్ చేసింది. బంగారాన్ని పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..?

వడపావ్ బాలుడికి దానం చేసిన సుందరి
ముంబై గోరెగావ్‌లోని గోకుల్ ధామ్ కాలనీలో పనిచేస్తున్న 45 ఏళ్ల సుందరి పనిముగించుకుని ఇంటికెళ్తోంది. తన దగ్గర ఉన్న 10 తులాల బంగారాన్ని మూటకట్టి వడపావ్ పార్సిల్లో పెట్టుకుని నడక ప్రారంభించింది . ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ అనాథ బాలుడు కనిపించడంతో మానవతా దృక్పథంతో తన దగ్గర ఉన్న వడపావ్ పార్సిల్ ని అతనికి దానం చేసింది. వడపావ్ పార్సిల్ తిన్న ఆబాలుడు మిగిలిన పార్శల్‌నూ పారేశాడు. ఈక్రమంలో పార్శిల్ కవర్‌ని గమనించిన ఎలుక దానిని డ్రైనేజీలోకి పట్టుకెళ్లింది. ఇంటికి చేరిన బాధిత మహిళ బంగారం కవర్ గుర్తుకు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఎలుక స్థావారాన్ని గుర్తించి.. గడ్డ పారతో ఆప్రదేశాన్ని తవ్వి బంగారాన్ని మహిళకు అప్పజేప్పారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా..
ఇక ఈఘటనపై పోలీస్ అధికారి సూరజ్ రౌత్ స్పందించారు. బంగారానికి సంబంధించి బాధిత మహిళను నుంచి ఫిర్యాదు అందడంతో తక్షణమే విచారణను మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. సీసీఫుటేజీ ఆధారంగా బాలుడిని గుర్తించామన్నారు. అనంతరం అతను తెలిపిన వివరాల ఆధారంగా చెత్తడంప్ కి వెళ్లి అక్కడి సీసీఫుటేజీ పరిశీలించినట్లు అధికారి చెప్పుకొచ్చాడు.

బంగారం ఇలా రికవర్ చేశారు
చెత్తడంప్ వద్దకు వెళ్లిన పోలీస్ బృందం అక్కడి సీసీఫుటేజీ ఆధారంగా బంగారం ఉన్న కవర్‌ని ఎలుక డ్రైనేజీలో పట్టుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే గడ్డపారతో ఆస్థలాన్ని తొలగించి బంగారం ఉన్న కవర్‌ని కనుగొన్నట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం బంగారం కవర్‌నూ బాధిత మహిళలకు పోలీస్ అధికారుల సమక్షంలో అందజేసినట్లు పోలీస్ అధికారి సూరజ్ రౌత్ పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications