వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ హై: ముంబైలో 624 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కేరళలో తప్ప మిగతా చోట్ల అంతగా కేసులు రావడం లేవు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇంపాక్ట్ లేదు. అయితే బుధవారం మాత్రం కాస్త పెరిగాయి. 600 పైచిలుకు కేసులు వచ్చాయి. 624 కేసులు రాగా.. ఇదీ అత్యధికం అని అధికారులు అంటున్నారు. జూలై 14వ తర్వాత ఇదే హైయస్ట్ అని చెప్పారు. ఆ రోజున 635 కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో 746, 703 కేసులు ఉన్నాయి.బుధవారం కరోనా సోకి ఏడుగురు ముంబైలో చనిపోయారు. మంగళవారం ఇద్దరు చనిపోగా.. బుధవారం మృతుల సంఖ్య కూడా పెరిగింది. నగరంలో 16,136 మంది చనిపోయారు. సెప్టెంబర్‌లోనే కరోనా కేసులు 500 మార్క్ చేరాయి. 8వ తేదీన 535, 15వ తేదీన 515, 29న 525 కేసులు వచ్చాయి. అక్టోబర్ 3వ తేదీన మాత్రం 573 కేసులు వచ్చాయి.

 Mumbai records 624 Covid-19 cases in 24 hours

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే అంశం.

English summary
Covid-19 cases in Mumbai breached the 600-mark on Wednesday after the city recorded 624 cases in the last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X