Love Affair: విద్యార్థితో మహిళా టీచర్ సంబంధం.. మాత్రలు ఇచ్చి మరీ..!
Love Affair: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన టీచరే దారి తప్పి కీచకురాలిగా మారింది. పుస్తకాల్లోని పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ విద్యార్థికి ప్రేమ పాఠాలు నేర్పించింది. వద్దని విద్యార్థి వారించినా.. టీచర్లు, విద్యార్థుల మధ్య ఇలాంటివి సహజమే అంటూ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. చివరకు ఆ బాలుడి ఇంట్లో విషయం తెలియడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురుశిష్యుల బంధానికి మచ్చగా మారిన ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. ముంబైలోని ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల మహిళా టీచర్ గత ఒక సంవత్సరంలో అనేక సార్లు 16 ఏళ్ల మగ విద్యార్థిపై లైంగిక దాడి చేసిన ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముంబైలోని ఓ ప్రముఖ స్కూల్‌లో పని చేస్తున్న మహిళా టీచర్ 11వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోధించింది. 2023లో పాఠశాల వార్షికోత్సవం కోసం డ్యాన్స్ గ్రూప్ ను ఏర్పాటు చేయడానికి వివిధ సమావేశాల సందర్భంగా బాధిత విద్యార్థితో టీచర్ పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత బాలుడిపై మోజు పెంచుకున్న సదరు టీచర్ క్రమంగా ఆ విద్యార్థితో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. ఈ క్రమంలో జనవరి 2024లో తొలిసారి విద్యార్థిని లైంగికంగా వేధించిన ఆ మహిళా టీచర్.. అనంతరం క్రమంగా వేధింపులను పెంచింది. మొదట్లో బాధితుడు అయిష్టంగా ఉండటం, ఆమెను నివారించడం ప్రారంభించడంతో, టీచర్ తన స్నేహితురాళ్లలో ఒకరిని రంగంలోకి దింపిందని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

ఆ టీచర్ స్నేహితురాలు విద్యార్థితో మాట్లాడుతూ.. వృద్ధ మహిళలు, టీనేజ్ అబ్బాయిల మధ్య సంబంధాలు సాధారణం అని బాలుడిని ఒప్పించే ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఆ విద్యార్థిని టీచర్ తన కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లడం, లగ్జరీ హోటల్ కు తీసుకెళ్లి అక్కడ మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడటం చేసింది. తరువాత టీచర్ బాలుడిని ఒక సెడాన్ కారులో ఎక్కించుకుని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లింది. "ఆమె బలవంతంగా అతని దుస్తులు తీసివేసి లైంగిక దాడి చేసింది. తరువాతి కొన్ని రోజులు విద్యార్థి ఆందోళన చెందడం ప్రారంభించినప్పుడు, ఆమె అతనికి కొన్ని యాంటీ-యాంగ్జైటీ మాత్రలు ఇచ్చింది" అని అధికారి తెలిపారు. అయితే బాలుడి ప్రవర్తనలో తేడాను గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పరీక్షలు త్వరలోనే పూర్తవుతాయని.. అనంతరం స్కూల్ మార్చవచ్చని ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచారు.
అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో 12వ తరగతి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణుడై పాఠశాలను విడిచిపెట్టిన తర్వాత కూడా టీచర్ మళ్లీ విద్యార్థిని సంప్రదించడంతో పరిస్థితి మరింత దిగజారింది."టీచర్ తన ఇంట్లో పనిచేసే సిబ్బంది ద్వారా విద్యార్థిని సంప్రదించి, ఆమెను కలవమని కోరింది. ఆ తర్వాత టీనేజర్ కుటుంబం మా వద్దకు వచ్చి కేసు నమోదు చేయాలని నిర్ణయించుకుంది" అని రెండో అధికారి తెలిపారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు ఆ మహిళా టీచర్‌పై పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ మహిళా టీచర్ కు ఇదవరకే పెళ్లయి పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications