Divya Pahuja: 11 రోజుల తర్వాత దివ్య పహుజా మృతదేహం కాలువలో లభ్యం
గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌లో జనవరి 2న హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం లభ్యమైంది. జనవరి 2వ తేదీన గురుగ్రామ్‌లోని హోటల్‌లో ఆమెను కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అక్కడ్నుంచి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి.. హోటల్ యజమాని అభిజీత్ సింగ్ సహా ఇద్దరు సిబ్బందిని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో దివ్య పహుజా మృతదేహం కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. దాదాపు 11 రోజుల తర్వాత హర్యానాలోని ఓ కాలువలో దివ్య మృతదేహాన్ని గుర్తించారు. హత్య జరిగిన తర్వాత దివ్య శవాన్ని నిందితులు పంజాబ్ రాష్ట్రంలోని బాఖ్‌డా కెనాల్‌లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ మృతదేహం హర్యానాకు కొట్టుకొచ్చినట్లు చెప్పారు.

తొహానా జిల్లాలోని ఓ కాలువ నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, తన అభ్యంతరకర ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకే దివ్యను చంపినట్లు నిందితుడు అభిజీత్ విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు ఆమెను హోటల్ కు తీసుకెళ్లి తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలిపారు.
కాగా, హర్యానా గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీతో దివ్యకు సంబంధాలన్నాయని పోలీసులు తెలిపారు. అయితే, 2016లో ముంబైలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో సందీప్ మరణించాడు. కానీ, అది నకిలీ ఎన్ కౌంటర్ అని.. సందీప్ నకు ప్రత్యర్థి అయిన బిందర్ గుజ్జర్ అనే మరో గ్యాంగ్‌స్టర్ హర్యానా పోలీసులతో కుమ్మక్కై చేయించాడని వెల్లడైంది. బిందర్ కుట్రలో భాగంగానే సందీప్ ను ఆమె అక్కడికి తీసుకొచ్చినట్లు అభియోగాలున్నాయి. ఈ కేసులో దివ్య జైలు శిక్ష కూడా అనుభవించడం గమనార్హం.
దివ్య పహుజా హత్య జరిగిన ఒక రోజు తర్వాత జనవరి 3న పంజాబ్‌లోని పాటియాలా సమీపంలోని భాక్రా కెనాల్‌లో ఆమె మృతదేహాన్ని పడేశారు. నిందితుడు బలరామ్ గిల్ పోలీసులకు ఈ కీలక సమాచారం అందించాడు. దివ్య పహుజా మృతదేహాన్ని పారేసిన వ్యక్తుల్లో నిందితుడు బలరామ్ గిల్ ఒకడని తెలిపారు. కోల్‌కతాలో బలరామ్ గిల్ పట్టుబడిన తర్వాత పోలీసులకు ఈ సమాచారం అందింది. న్యూఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కోల్‌కతా విమానాశ్రయంలో బలరామ్ గిల్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications