ఫోన్ పక్కన పెడదామనుకునే లోపే ప్రమాదం, 36 మంది మృతి: పొగమంచూ కారణం
Recommended Video

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. డ్రైవర్ కారణంగానే జరిగినట్లు తెలుస్తోంది. బహరంపుర్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లింది.
దీంతో 36 మంది మృతి చెందారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ ఫోనులో మాట్లాడుతున్నాడని క్షతగాత్రులు పోలీసులకు తెలిపారు. బస్సు నడుపుతున్నప్పుడు డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నాడని, కేవలం ఎడమ చేతితోనే స్టీరింగ్ పట్టుకున్నాడని, ఫోను పక్కన పెట్టమని చెబుదామనుకునే లోపే బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిందని క్షతగాత్రులు చెప్పారు.

మరోపక్క ఈ ప్రమాదం పొగ మంచు కారణంగానే జరిగిందని మానవ తప్పిదం వల్ల కాదని టీఎంసీ నేత సౌమిక్ హుస్సేన్ మీడియా ద్వారా వెల్లడించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎనిమిది గంటల పాటు శ్రమించి అధికారులు బస్సును నది నుంచి బయటకు తీశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.












Click it and Unblock the Notifications