Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వందేమాతరం పాడమంటూ తెగేసి చెప్పిన ముస్లిం ఎమ్మెల్యే!

జాతీయ గీతం వందేమాతరం మరోసారి రాజకీయ వివాదానికి కేంద్రమైంది. ముంబైలో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ వందేమాతరంపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. "ముస్లింలు ఎవరూ వందేమాతరం పాడలేరు. నాతో వందేమాతరం పాడించాలని ఎవరూ బలవంతం చేయలేరు" అని ఎమ్మెల్యే అబూ ఆజ్మీ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే కామెంట్స్ వెనుక మతపరమైన వాదన
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ముంబైలో ఈ కొత్త వివాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎస్పీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ మాట్లాడుతూ.. "ఎవరూ నా చేత వందేమాతరం పలికించలేరు. ఇస్లాంలో భూమిని, సూర్యుడిని పూజించడం ఉండదు. అల్లాహ్ తప్ప మరెవరినీ ఆరాధించరు. మీరు నమాజ్ చేయనట్లే ఏ ముస్లిం కూడా వందేమాతరం పాడలేరు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Muslim MLA Abu Azmi Controversial Comments on Vande Mataram BJP Reacts Strongly

వివాదం ఎలా మొదలైందంటే?
ముంబై బీజేపీ అధ్యక్షుడు అమిత్ సాటమ్ వందేమాతరం వివాదానికి ఆజ్యం పోశారు. శుక్రవారం ఉదయం తమ నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన జాతీయ గీతం "వందేమాతరం" గాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ అమిత్ సాటమ్ ఎస్పీ ఎమ్మెల్యే అబూ ఆసిం ఆజ్మీకి బహిరంగంగా ఆహ్వానం పంపారు.అమిత్ సాటమ్ దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో షేర్ చేస్తూ ఆజ్మీని ట్యాగ్ చేశారు. ఇక్కడి నుంచే వివాదం మొదలైంది.

అబూ ఆజ్మీ న్యాయపరమైన కౌంటర్
బీజేపీ ఆహ్వానానికి అబూ ఆజ్మీ న్యాయపరమైన భాషలో సమాధానం ఇచ్చారు. ఎవరినైనా బలవంతంగా జాతీయ గీతం పాడమని ఒత్తిడి చేయడం, ఆ వ్యక్తి మతం, అంతరాత్మ స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆజ్మీ గుర్తు చేశారు.'వందేమాతరం'కు జాతీయ గీతం 'జనగణమన'తో సమానమైన చట్టపరమైన హోదా, రక్షణ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఆయన పేర్కొన్నారు.

అబూ ఆజ్మీ ఇంటి వద్ద బీజేపీ నిరసన
అబూ ఆజ్మీ కామెంట్స్ తర్వాత బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా, ముంబై బీజేపీ అధ్యక్షుడు అమిత్ సాటమ్, అసెంబ్లీ స్పీకర్ రాహిల్ నార్వేకర్ శుక్రవారం అబూ ఆసిం ఆజ్మీ ఇంటి ఎదురుగా వేదిక ఏర్పాటు చేసి వందేమాతరం ఆలపించారు. ఈ సందర్భంగా వేదిక నుంచి కొన్ని వివాదాస్పద నినాదాలు కూడా వినిపించినట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+