ముంబైలో దారుణం- హిందూ యువతితో కలిసి వెళ్తున్నాడని ముస్లిం యువకుడిపై మూక దాడి...

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఇంత అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా చెప్పుకుంటున్న ముంబైలో ఉన్న బాంద్రా టెర్మినస్ లో ఓ హిందూ-ముస్లిం యువతీ యువకులు కలిసి వెళ్తుండగా చూసిన గుంపు మూకదాడికి పాల్పడింది. విచక్షణా రహితంగా బూతులు తిడుతూ ఆ యువకుడిని చితకబాదింది. ఈ దృశ్యాల్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రీ ఫ్రెస్ జర్నల్ వెబ్ సైట్ బయటపెట్టింది.

ఓవైపు ముంబైలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు సాగుతుండగా.. మరోవైపు హిందూ యువతితో తిరుగుతున్నాడనే ఆరోపణతో ఒక ముస్లిం యువకుడిని ఒక గుంపు దారుణంగా కొట్టిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తిని ఆ గుంపులో ఉన్న వారంతా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ, మరోవైపు బూతులు తిడుతూ చెప్పులతో కొట్టడం కనిపించింది.

muslim
ఈ గుంపులోనే ఉన్న మరికొందరు ఈ ఘటన వీడియోలను తీశారు. అలాగే అమ్మాయికి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని బాధితుడితో చెప్పడం కూడా వినిపించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని రైల్వే స్టేషన్ బయటికి ఈడ్చుకెళ్లారు. దుండగులు "జై శ్రీరామ్" అంటూ నినాదాలు చేస్తూ ఆ వ్యక్తి జుట్టు, కాలర్ పట్టుకుని బయటకు లాగారు. దీంతో పట్టపగలే చోటు చేసుకున్న ఈ ఘటన ముంబైలో కలకలం రేపింది. కానీ తాము ఇవాళ బాంద్రా టెర్మినస్‌లో ఒక మైనర్ హిందూ బాలికను రక్షించామని గుంపులో ఉన్న ఒక వ్యక్తి కెమెరాలో చెప్పాడు.

ట్విట్టర్‌లోని కొందరు ఈ వీడియోను పోస్ట్ చేసి ముంబై పోలీసులు, రైల్వే పోలీస్ ఫోర్స్ ముంబై సెంట్రల్ డివిజన్‌ను ట్యాగ్ చేశారు. కానీ ముంబై పోలీసుల ట్విట్టర్ హ్యాండిల్ దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే ఆర్పీఎఫ్ మాత్రం ఈ విషయం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో విపక్షాలు ఈ ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+