ముస్లింలోను ఓబీసీ జాబితాలో చేర్చిన ప్రభుత్వం
Karnataka Muslims reservations: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఈ నెల 26వ తేదీన శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 89 స్థానాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మలి విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది.

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా..కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాల్లోని 14 నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. మిగిలిన 14 నియోజకవర్గాల్లో మే 7వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించడానికి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా- రాష్ట్రంలోని ముస్లింలను ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది. ముస్లిం జనాభా మొత్తానికీ ఓబీసీ హోదా కల్పించినట్లు వెల్లడించింది. వారిని కేటగిరి 2-బీ పరిధిలోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. దీనివల్ల ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీ రిజర్వేషన్ వర్తింపజేసినట్లయింది. ఈ విషయాన్ని తాజాగా జాతీయ బీసీ కమిషన్ నిర్ధారించింది.
కర్ణాటకలో రెండు కేటగిరీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. కేటగిరి 1, 2-ఏ, కేటగిరి 2-బీ. ముస్లింలల్లో 36 కులాలవారని ఈ రెండు కేటగిరీల్లో చేర్చారు. ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితిని ఆధారంగా చేసుకుని 17 కులాల వారిని కేటగిరి 1లో, మిగిలిన 19 కులాల వారిని కేటగిరీ 2-ఏ పరిధిలోకి తీసుకొచ్చారు. కర్ణాటకలో ఉన్న ముస్లిం జనాభా 12.92 శాతం.












Click it and Unblock the Notifications