వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యూచువల్ ఫండ్స్ - ఈక్విటీ ఫండ్స్: ఎందుకంత ఆకర్షణీయమైన మదుపు మార్గాలుగా మారాయి.. వీటి ద్వారా పొందే లాభం ఏంటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

"మ్యూచువల్ ఫండ్స్ సహి హై" అనే ప్రకటనలు ఇటీవలి కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయి. ప్రకటనలకు తగినట్టుగానే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేస్తున్న వారి సంఖ్య గత ఐదేళ్ళలో గణనీయంగా పెరిగి, ఇప్పుడొక విప్లవంగా మారింది.

1963లో చిన్న మదుపరులను స్టాక్ మార్కెట్లో భాగస్వాములను చేయాలనే ఉద్దేశ్యంతో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటైన మ్యూచువల్ ఫండ్స్ దేశంలో మొదటి ఫండ్ హౌస్.

2017-2022 మధ్య మూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేస్తున్న మదుపరుల సంఖ్య 200 శాతం పెరిగింది. అలాగే మదుపు చేస్తున్న మొత్తం కూడా భారీగా పెరిగింది. ఇందుకు కారణాలు అనేకం.

భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య వారి వెబ్ సైట్ ప్రకారం 2012 సెబీ సరళించిన నియమాల వల్ల మ్యూచువల్ ఫండ్స్ బాగా వృద్ధి చెందే అవకాశం కలిగింది.

అలాగే. నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ లాంటి కొత్త టెక్నాలజీని వాడుకుంటున్న డిస్ట్రిబ్యుటర్లు కూడా మ్యూచువల్ ఫండ్స్ చిన్న పట్టణాలకు విస్తరించేందుకు దోహద పడ్డారు.

వీటి కంటే ముందుగా అసలు ఒక మదుపరి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పొందే విలువ ఏమిటో, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అంత ఆకర్షణీయమైన మదుపు మార్గాలుగా మారాయో చూద్దాం.

1. 80సీ పన్ను రాయితీ

అన్ని ఈ.ఎల్.ఎస్.ఎస్ పథకాలలో పెట్టిన మదుపు మొత్తాన్ని 80సీ ద్వారా పన్ను రాయితీ పొందవచ్చు. పెట్టిన మొత్తం మీద వచ్చే రాబడి ఎలా ఉన్నా, అది పన్ను రాయితీకి అదనం. కాబట్టి మదుపరులకు నష్ట భయం చాలా తక్కువ.

2. వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం

స్టాక్ మార్కెట్లో ఒక సంస్థ షేర్లలో మదుపు చేస్తే ఆ సంస్థ నష్టాల్లో కూడా మనం భాగస్వాములం అవుతాం. కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వివిధ సంస్థల్లో లేదా వివిధ రంగాల్లో ఒకేసారి మదుపు చేసే అవకాశం కలుగుతుంది.

దీని వల్ల ఒక సంస్థ నష్టపోయినా మరో సంస్థలో వచ్చిన లాభాలు మనకు ఊరట కలిగిస్తాయి.

3. నిరంతర పర్యవేక్షణ

పేరు మదుపరులదే అయినా మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ మొత్తం ఫండ్ మేనేజర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫండ్ మేనేజర్లు ఎప్పటికప్పుడు ఫండ్ పరిస్థితిని పర్యవేక్షిస్తుంటారు.

ఏదైనా ఒక సంఘటన ఒక రంగాన్ని లేదా ఒక సంస్థను ప్రభావితం చేసే పరిస్థితులు ఎదురైతే, అందుకు తగిన విధంగా ప్రతిచర్యలు తీసుకునే అవకాశం ఫండ్ మేనేజర్లకు ఉంటుంది.

4. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)

ఈ పథకంలో మదుపరుల బ్యాంక్ ఖాతా నుంచి ప్రతి నెలా ఒక నిర్ధిష్టమైన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేయడానికి ఉపయోగిస్తారు. కనీస మొత్తం 500 నుంచీ మొదలవుతుంది.

గతంలో పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు ప్రాచుర్యం పొందినట్టు, ఈ పథకం కూడా మదుపరులను ఆకర్షిస్తోంది. 2016లో ఉన్న కోటి యస్.ఐ.పి ఖాతాలు ప్రస్తుతం అయిదు కోట్లకు చేరుకున్నాయి. ప్రతీ నెల సగటున 11 లక్షల కొత్త యస్.ఐ.పి ఖాతాలు తెరుస్తున్నారు.

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులపై భయపడే వారు మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు

5. పారదర్శకత

మన మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం టెక్నాలజీ రావడం వల్ల చాలా సులభతరం అయ్యింది. యాప్ ద్వారా చాలా విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

అలాగే నెలకు ఒకసారి డిస్ట్రిబ్యూటర్లు కూడా మనం మదుపు చేసిన అన్ని పథకాల పరిస్థితి ఎలా ఉందో మనకు మెయిల్ ద్వారా తెలియజేస్తారు.

మరోవైపు సెబీ నియమాలలో కూడా మదుపరులకు పారదర్శకత కలిగించడం చెప్పుకోవలసిన విషయం.

మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నా, అన్ని మదుపు మార్గాల్లాగే ఈ పథకాలలో కూడా సహజంగా కొంత రిస్క్ ఉంది. కాబట్టి మన అవసరాలకు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకోవాలి.

మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని రకాలున్నాయి, ఎలాంటి ఆర్థిక లక్ష్యాలకు ఏ రకమైన ఫండ్స్ ద్వారా మదుపు చేయాలో తెలుసుకుందాం.

ముందుగా, మ్యూచువల్ ఫండ్స్ వర్గీకరణకు అనేక కొలమానాలు ఉన్నాయి. అందులో "ఎలాంటి సంస్థల యూనిట్స్ మనకు ఇస్తున్నారు" అనే కారణం మీద చేసిన వర్గీకరణ చాలా ముఖ్యమైనది.

లార్జ్ క్యాప్ ఫండ్స్

ఈ రకమైన ఫండ్స్ ద్వారా మదుపరి మదుపు చేసిన మొత్తాన్ని అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన తొలి 100 సంస్థల్లో పెట్టుబడిగా పెడతారు. ఈ రకమైన ఫండ్స్ రిస్క్ చాలా తక్కువ ఎందుకంటే ఈ సంస్థల్లన్నీ చాలా పెద్ద సంస్థలు నష్టాలు వచ్చే అవకాశం తక్కువ.

మరోవైపు, ఈ సంస్థలు మరింతగా పెరిగే అవకాశం కూడా తక్కువే ఎందుకంటే మార్కెట్ పెంచుకునే అవకాశం పెద్దగా ఉండదు. ఉదాహరణకు టాటా స్టీల్, హిందుస్థాన్ లీవర్ లాంటి సంస్థలు ప్రస్తుతం ఒక స్థిరమైన స్థాయిని చేరుకున్నాయి. ఇక్కడ నుంచీ విస్తరించడానికి అవకాశాలు తక్కువ.

అలాగే, ఎన్నో ఏళ్ళుగా ఏర్పరుచుకున్న తమ వ్యాపారం నష్టాలలోకి వెళ్ళే అవకాశం కూడా తక్కువే. అందుకే ఈ సంస్థల్లో పెట్టే మదుపు నుంచి లాభాలు రావాడానికి కనీసం అయిదేళ్ల కాల వ్యవధి పడుతుంది.

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు ప్రయోజనాలు, నష్టభయాలను కూడా పరిశీలించాలి.

మిడ్ క్యాప్ ఫండ్స్

ఈ రకమైన ఫండ్స్ ద్వారా మదుపు చేసిన మొత్తాన్ని అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన 100-250 సంస్థల్లో పెట్టుబడిగా పెడతారు. ఈ సంస్థలు విస్తరించే అవకాశం కొంత మెరుగ్గా ఉంటుంది కాబట్టి కొంత త్వరగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మూడేళ్ల తర్వాత అవసరం అయ్యే ఆర్థిక లక్ష్యాలకు ఈ ఫండ్స్ ఉపయోగించుకోవచ్చు.

స్మాల్ క్యాప్ ఫండ్స్

ఈ రకమైన ఫండ్స్ ద్వారా మదుపు చేసిన మొత్తాన్ని చిన్న సంస్థల్లో ముఖ్యంగా ఇప్పుడే మొదలవుతున్న సంస్థల్లో పెట్టుబడిగా పెడతారు. ఇవి చాలా ఎక్కువ రిస్క్ ఉన్న ఫండ్స్. అయినప్పటికీ, ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉన్న ఫండ్స్.

ఇటీవలి కాలంలో టెక్నాలజీ సంస్థలు ఈ కోవలోకి వస్తున్నాయి. 90వ దశకంలో ఇన్ ఫోసిస్ సంస్థ ఈ వర్గంలో ఉండేది. అప్పట్లో ఇన్ ఫోసిస్ సంస్థలో మదుపు చేసిన వారు తర్వాత కాలంలో గణనీయమైన లాభాలు పొందారు. తక్కువ కాలవ్యవధిలో లాభాలు ఇచ్చే అవకాశం ఉన్న ఫండ్స్ ఇవి.

పైన చెప్పిన మూడు రకాల ఫండ్స్ ద్వారా చేసిన మదుపు కూడా రిస్క్ ఉన్నవే కానీ, కాలవ్యవధి ఎక్కువ అయ్యే కొద్దీ మదుపరికి నష్టం వచ్చే అవకాశం కూడా తక్కువ. అందుకే మదుపు అంటేనే దీర్ఘకాలికమైనది అనే నానుడి ఉంది.

ప్రతీ రంగానికి ప్రత్యేకమైన ఫండ్స్

ఇవే కాక కేవలం ఒక రంగానికే పరిమితమైన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. బ్యాంకింగ్, ఎఫ్.ఎం.సి.జి, లోహాధారిత పరిశ్రమలు ఇలా ప్రత్యేక రంగానికి చెందిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఫండ్స్‌లో మదుపు చేసే ముందు ఆ రంగానికి సంబంధించిన అవగాహన చాలా ముఖ్యం.

ఉదాహరణకు, బ్యాంకింగ్ రంగం మీద ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం చాలా ఎక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, ప్రభుత్వం ఆ రంగం మీద ప్రత్యేక శ్రద్ద పెడుతుంది.

అలాగే, ఎఫ్.ఎం.సిజి. రంగం మీద ప్రజల కొనుగోలు శక్తి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొనుగులు శక్తి తగ్గడం లేదా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం లాంటివి ఈ రంగంలోని సంస్థల లాభనష్టాలను ప్రభావితం చేస్తాయి.

కానీ దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచిస్తే ఈ రంగంలో నష్టాలు వచ్చే అవకాశం తక్కువ. మనం మదుపు చేస్తున్న మొత్తంలో 30 శాతం ఎఫ్.ఎం.సి.జి ఫండ్స్ ద్వారా మదుపు చేయడం వల్ల ఒక స్థిరమైన ఆదాయ మార్గాన్ని ఏర్పరుచుకోవచ్చు. వారెన్ బఫెట్ తన మదుపులో ఈ రంగానికి పెద్దపీట వేశారు.

కరెన్సీ నోట్లు

ఇండెక్స్ ఆధారిత ఫండ్స్

ఈ రకమైన ఫండ్స్ కేవలం సెన్సెక్స్ లాంటి సూచీలలో భాగంగా ఉండే సంస్థల్లో మాత్రమే మదుపు చేస్తారు. ఈ ఫండ్స్ నిర్వహణలో ఫండ్ మేనేజర్ పాత్ర కూడా పెద్దగా ఉండదు.

ఈ ఫండ్స్ వెనుక ఆలోచన ఏమంటే ,సూచీలలో భాగంగా ఉండే సంస్థలు సహజంగా లాభదాయకంగా ఉంటాయి. ఒకవేళ వాటి లాభదాయకత తగ్గిపోతే వాటిని ఆ సూచీల నుంచి తొలగిస్తారు. కనుక ఈ ఫండ్స్ ద్వారా నష్టపోయే అవకాశం తక్కువ.

ఎలాంటి ఫండ్స్ ద్వారా మదుపు చేసినా దీర్ఘకాలిక ఆలోచనతో మదుపు చేసిన వారికి మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి మదుపు మార్గం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mutual Funds - Equity Funds: Why They Have Become Attractive Investment Paths
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X