నా భర్త నన్ను, పిల్లల్ని చంపేయాలనుకుంటున్నారు! టీవీ నటి
ముంబై: తన భర్త అరోరా తనను, తన పిల్లలను చంపాలని చూస్తున్నాడని ప్రముఖ టీవీ నటి దీప్‌శిఖ నాగ్‌పాల్ ఆరోపించారు. తన పెళ్లి జీవితంలోని సమస్యలను ఆమె వెల్లడించారు. ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాను తన భర్త నుండి కాపాడుకోవడం కోసం రక్షణ కావాలని పోలీసులను అడిగినట్లు చెప్పారు.
తాను పోలీసుల వద్దకు వెళ్లానని, నా భర్త నుండి తనకు, తన కుటుంబ సభ్యులను రక్షించాలని కోరానని చెప్పారు. తన భర్త తనను, తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు.

ఇటీవల, ఏప్రిల్ 10వ తేదీ నుండి 15 తేదీ మధ్యన దీప్‌శిఖ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా తన సమస్యలను ఏకరవు పెట్టారు.
జీవితం చాలా కష్టమైనదని, అయితే తాను చాలా ధైర్యవంతురాలినని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను పోరాడుతానని పేర్కొన్నారు. దేవుడు నాకు శక్తిని ఇవ్వాలన్నారు. పోరాడినప్పుడు జీవితంలో ఏం కోల్పోయామో తెలుస్తుందని, ఆ తర్వాత గత జీవితం కంటే ఇప్పుడు చాలా బాగున్నామని తెలుసుకుంటామని మరో ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, టీవీ నటి దీప్‌శిఖకు ఆరోరాతో జనవరి 2012లో వివాహం జరిగింది. దీప్‌శిఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొన్నారు. ఇది దీప్‌శిఖకు రెండో పెళ్లి. ఆమెకు ఈ రెండో పెళ్లి కంటే ముందే మొదటి పెళ్లి ద్వారా విధిక, వివాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మొదటి భర్త జీత్ ఉపేంద్ర. అతనితో పదేళ్ల పాటు జీవితం పంచుకున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications