వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు ఏమీ మాట్లాడని ప్రభుత్వాలు నేడు నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నాయి: విపక్షాలపై మోడీ ఫైర్

|
Google Oneindia TeluguNews

గత యూపీఏ ప్రభుత్వంలా పనిచేసే వ్యక్తినైతే ప్రజలు 2014 ఎన్నికల్లో తనను ఎందుకు ప్రధానిగా ఎన్నుకుంటారని ప్రశ్నించారు నరేంద్ర మోడీ . ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని గజియాబాద్‌లో ఆయన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. పుల్వామా దాడులపై మాట్లాడిన ప్రధాని అందుకు సరైన సమాధానంగా వైమానిక దాడులు చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలా కాకుండా తమ ప్రభుత్వం వెంటనే ప్రతిచర్యకు దిగుతోందని చెప్పారు. అందుకే ప్రజలు మార్పు కోరి తనను ఢిల్లీకి పంపారని వెల్లడించారు.

మహిళా దినోత్సవం రోజు రాహుల్ వరాలు: మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తాంమహిళా దినోత్సవం రోజు రాహుల్ వరాలు: మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తాం

అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని ప్రభుత్వాలు నేడు తన నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయని ధ్వజమెత్తారు ప్రధాని .బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిగాయని విపక్షాలు రుజువులు అడుగుతున్నాయని... అయితే 130 కోట్ల మంది ప్రజలకు అది తెలుసని విపక్షాలను నమ్మించాల్సిన అవసరం లేదని మోడీ చెప్పారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళతామని తెలిసి ముందుగా ఢిల్లీ నుంచి తనను తొలగించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్‌పై పరోక్షంగా మాటలదాడిని పెంచారు ప్రధాని. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాక కూడా రుజువులు కావాలన్న అదే వ్యక్తులు నేడు కూడా అదే పాటను పాడుతున్నాయని చెప్పారు.

My proof is faith of 130 million people: PM Modi to Opposition on Balakot airstrike

పాకిస్తాన్‌కు వంత పాడటం మానుకోవాలని విపక్షాలను తాను కోరుతున్నట్లు ప్రధాని చెప్పారు. ఇక ఘజియాబాద్‌లో పర్యటించిన ప్రధాని అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ రోజు లక్నో, ఆగ్రా, ఘజియాబాద్‌లలో మెట్రో ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయని రేపు నోయిడాకు సంబంధించిన మెట్రో కొత్త లైను ప్రారంభం అవుతుందని , నిన్న నాగ్‌పూర్ మెట్రోను స్టార్ట్ చేశామని మోడీ చెప్పారు. సమాజంలో ఆర్థికంగా వెనకబడిన వారి మేలు కోసం తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు ప్రధాని.

తమ ప్రభుత్వ హయాంలో బీద బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో వెలుగును నింపామని చెప్పిన మోడీ...తమ ప్రభుత్వం ఎప్పుడూ బలహీనవర్గాల వారి ఉన్నతికి శ్రమిస్తుందని చెప్పారు. అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇప్పుడు ఆ అభివృద్ధే దేశవ్యాప్తంగా జరుగుతోందని మోడీ చెప్పారు.

English summary
PM Narendra Modi on Friday said that if he had to work like the previous government, why would the people elect him as their leader.PM Modi was addressing a public meeting in Ghaziabad.He also talked about the Pulwama attack and said, "If I had to work like the previous government, why would you elect me for Delhi?"He also criticised the Opposition and said that the same people who did nothing before are questioning his decisions today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X