నువ్వే ఏమైనా అమితాబ్, ఎన్టీఆర్ అనుకుంటున్నావా: ప్రకాష్ రాజ్ మీద బీజేపీ ఎంపీ ఫైర్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: హిందూ ఉగ్రవాదం, ఉత్తరప్రదేశ్ ఆసుపత్రిలో పిల్లల వరుస మరణాలు, గౌరీ లంకేష్ హత్య తదితర విషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ మీద విమర్శలు చేసిన బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ కు బీజేపీ ఎంపీ ఝలక్ ఇచ్చారు.

ప్రకాష్ రాజ్ ఒక సామాన్యనటుడు మాత్రమే, ప్రపంచం గర్వించదగిన నటుడు కాదని కర్ణాటకలోని మైసూరు లోక్ సభ నియోజక వర్గం ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహా అన్నారు. సోమవారం మైసూరులో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ప్రకాష్ రాజ్ మీద విమర్శలు గుప్పించారు.

నువ్వేమైన అమితాబ్, ఎన్టీఆర్ !

నువ్వేమైన అమితాబ్, ఎన్టీఆర్ !

డాక్టర్ రాజ్ కుమార్, నందమూరి తారకరామారావు, అమితాబ్ బచ్చన్, ఎంజీఆర్ తదితర మహానటులు సైతం ప్రకాష్ రాజ్ మాట్లాడినట్లు ఒక్క సారికూడా మాట్లాడలేదని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా గుర్తు చేశారు. నేను మహానటుడు అంటూ ప్రకాష్ రాజ్ తనంతకు తాను ఊహించుకుంటున్నాడని ప్రతాప్ సింహా ఎద్దేవ చేశారు.

విమర్శలు చేసి పారిపోతాడు

విమర్శలు చేసి పారిపోతాడు

ఒక చోట విమర్శలు చేసి మరో చోటకు పారిపోయే ప్రకాష్ రాజ్ లాగా నేను పారిపోనని, తనకు ప్రజలు ఓటు వేసి ఎంపీగా గెలిపించారని, నా నియోజక వర్గం వదిలి పారిపోవడం సాధ్యం కాదని ప్రతాప్ సింహా చెప్పారు. ప్రకాష్ రాజ్ ఆరోపణల వెనుక సొంత లాభం ఏమైనా ఉందా అనే అనుమానం వస్తోందని ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు.

కళ్లు కనపడవా, ఎందుకు మాట్లాడలేదు

కళ్లు కనపడవా, ఎందుకు మాట్లాడలేదు

ఉత్తరప్రదేశ్ లో పిల్లల వరుస మరణాలపై మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ అదే కర్ణాటకలోని కోలారు ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వరుస మరణాలు జరిగినా ఎందుకు ప్రశ్నించలేదని, ఈ రాష్ట్రంలో దారుణ హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ నాయకుడు శరత్ మడివాళ హత్య కేసులో ఎందుకు స్పంధించలేదని, అప్పుడు నీకు కళ్లుకనపడేదా అంటూ ప్రకాష్ రాజ్ ను సూటిగా ప్రశ్నించారు.

నువ్వు మాట్లాడినట్లే మేము మాట్లాడుతాం !

నువ్వు మాట్లాడినట్లే మేము మాట్లాడుతాం !

నువ్వు ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి ఎలా మట్లాడావో ప్రజలు, నేను నిన్ను అలాగే ప్రశ్నిస్తున్నామని ప్రకాష్ రాజ్ మీద బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాటలతూటాలు పేల్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తగినబుద్ది చెబుతారని ప్రకాష్ రాజ్ ను హెచ్చరించారు.

కర్ణాటక మంత్రితో ప్రకాష్ రాజ్

కర్ణాటక మంత్రితో ప్రకాష్ రాజ్

కర్ణాటక మంత్రి రామ్ నాథ్ రై (కాంగ్రెస్) తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను లక్షంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్ ను లక్షంగా చేసుకుని బీజేపీ నాయకులు మాటలతూటాలు పేల్చుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prathap simha said 'Prakash Rai is doing 'Split and run' not hit and run, he is just making anti modi statments because of political gain.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి