Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వింత: మనిషి పోలికలతో పుట్టిన మేక పిల్లలు (ఫొటో)

మైసూరు: కర్ణాటక రాష్ట్రంలోని సోలాపూర్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ మేక అచ్చం మనిషి పోలికలతో ఉన్న రెండు పిల్లలను కన్నది. అచ్చం మనిషి పోలికలతో ఉన్న మగ పిల్ల ఉదయం 6.30 గంటలకు పుట్టింది. ఐదుగంటల తర్వాత ఆడ మేక పిల్ల పుట్టింది.

ఆ మేకను తాను నాలుగేళ్లుగా పెంచుతున్నానని, అది ఇప్పటికీ పది పిల్లలను కనిందని.. అన్నీ బాగానే ఉన్నాయని యజమాని భాస్కర్ తెలిపాడు. అయితే ఇప్పుడు మాత్రమే ఇలాంటి మనిషి పోలికలో ఉన్న పిల్లలను కందని చెప్పాడు.

Mysore Shocker: Goat delivers human-like kids

కాగా, మనిషిలాగా మేక పిల్ల పుట్టిందనే వార్త గ్రామంలో వ్యాపించడంతో తండోపతండాలుగా వచ్చిన జనాలు ఆ మేక పిల్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. మేక పిల్లలు ఇలా వింతగా పుట్టడం అరిష్టమని, అందువల్ల వెంటనే వాటిని పూడ్చేయాలని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వాసుదేవదాస్ మాట్లాడుతూ..వైద్య పరిభాషలో దీన్ని ఫీటల్ అనసర్టా అంటారని చెప్పారు. అంటే తల్లి కడుపులో ఉండాల్సిన ఉమ్మనీరు పిల్ల శరీరంలోకి వెళ్లిపోతే ఇలా జరుగుతుందని వివరించారు. జన్యుపరమైన తేడాల వల్ల కూడా ఇలా జరుగుతుందని తెలిపారు. ఆ రెండు మృత మేక పిల్లలను మైసూరు దసరా ఉత్సవంలో ప్రదర్శిస్తామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+