Veerappan: స్మగ్లర్ వీర్పన్ ఏరియాలో ఏం జరుగుతోంది, ఎదురు కాల్పులతో కలకలం !
స్మగ్లర్ గా తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన చాలా సంవత్సరాల తరువాత ఆయన సొంత ఊరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
చామరాజనగర్/చెన్నై: స్మగ్లర్ వీరప్పన్. ఆ పేరు చెబితే కొన్ని దశాభ్దాల పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు గడగడలాడిపోయాయి. తమిళనాడులో, కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకోవడానికి అప్పట్లోనే కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంత వరకు స్మగ్లర్ గా ఉంటూ తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్ తరువాత మరో అవతారం ఎత్తాడు. తరువాత కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసిన తరువాత వీరప్పన్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. వీరప్పన్ పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయిన చాలా సంవత్సరాల తరువాత ఆయన సొంత ఊరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

సైలెంట్ అయిపోయిన ఊరు
కర్ణాటక, తమిళనాడు పోలీసులు అనేక సంవత్సరాల పాటు ప్లాన్ వేసి కోవర్టు సహాయంతో వీరప్పన్ ను అండర్ గ్రౌండ్ నుంచి బయటకు రప్పించారు. అనారోగ్యంతో ఉన్న స్మగ్లర్ వీరప్పన్ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అంబులెన్స్ లో వెలుతున్న సమయంలో తమిళనాడు, కర్ణాటక పోలీసులు అతన్ని ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేశారు. కోవర్టు మాటలతో మోసపోయిన స్మగ్లర్ వీరప్పన్ చరిత్ర అంతటితో అంతం అయ్యింది.

జైల్లో వీరప్పన్ అనుచరులు
వీరప్పన్ బతికుండగానే చాలా మంద అతని అనుచరులు పోలీసులకు చిక్కిపోయి జైలుపాలైనారు. చాలా మంది పోలీసుల ఎన్ కౌంటర్ లో అంతం అయ్యారు. వీరప్పన్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన తరువాత కొంత మంది ఆయనకు వారసులు కావాలని ప్రయత్నించినా పోలీసులు మాత్రం ఎవ్వరిని వదల్లేదు. అలా స్మగ్లర్ వీరప్పన్ కథ క్లోజ్ అయిపోయింది. అయితే మరోసారి వీరప్పన్ ఊరు. ఆ పరిసర ప్రాంతాలు హాట్ టాపిక్ అయ్యాయి.

ఎదురు కాల్పులు
వీరప్పన్ చనిపోయిన తరువాత కూడా కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని హనూర్ తాలూకాలోని గోపీనాథం, పాలార్ (కర్ణాటక- తమిళనాడు బార్డర్) చుట్టుపక్కల వేటగాళ్లు ఎక్కువ అయ్యి అటవి శాఖ అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నారు. అటవీశాఖ సిబ్బందికి, వేటగాళ్లకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కావేరీ నదీ తీరంలో వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని పలార్ ప్రాంతంలో జింకలను వేటాడుతున్న సుమారు నలుగురు వేటగాళ్లు, ముగ్గురు అటవీ శాఖ సిబ్బంది మధ్య ఎదరు కాల్పులు జరగడంతో ప్రజలు హడలిపోయారు. అయితే వేటగాళ్లు కావేరీ నదిలో దూకి తప్పించుకున్నారని అటవి శాఖ అధికారులు అంటున్నారు.

అలర్ట్ అయిన పోలీసులు, అటవి శాఖ అధికారులు
ఆ ప్రదేశంలో వేటగాళ్లు ఉపయోగించే బ్యాటరీలు లభ్యం కావడంతో వాటిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మలేమహదేశ్వర్ బెట్ట పోలీస్‌స్టేషన్‌లో అటవి శాఖ అధికారులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారని ఏసీఎఫ్ అంకరాజు మీడియాకు చెప్పారు.
పాలార్ చుట్టుపక్కల ఉన్న కావేరీ నది తమిళనాడు-కర్ణాటక సరిహద్దుగా ప్రవహిస్తోంది. తమిళనాడు వైపు నుంచి వేటగాళ్లు తెప్పల ద్వారా కర్ణాటక రాష్ట్రానికి వచ్చి జింకలను వేటాడుతున్నారని, కాల్పులకు పాల్పడుతున్నారని అధికారులు అంటున్నారు. వేటగాళ్లు గోవిందప్పాడి గ్రామానికి చెందిన వారిగా పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications