దసరా ఏనుగులకు రూ. 35 లక్షల బీమా
మైసూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొనే ఏనుగులకు ఇన్యూరెన్స్ చేయించారు. అదే విధంగా మావటీలకు జీవిత భీమా చేయించారు. మొత్తం రూ. 89 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించారు.
అంబారిని మోసుకుని వెళ్లే అర్జునతో పాటు మొత్తం 12 ఏనుగులకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో రూ. 35 లక్షలకు జీవిత భీమా చేయించారు. అదే విధంగా మావటీలకు, ఏనుగులను చూసుకునే సిబ్బందికి రూ. 48 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించారు.
అదే విధంగా కొంత ఆస్తికి రూ. 30 లక్షల ఇన్సూరెన్స్ చేయించామని అటవి శాఖ అధికారి డాక్టర్ కమల చెప్పారు. సెప్టెంబర్ 4వ తేది నుండి అక్టోబర్ 30వ తేది వరకు ఈ ఇన్సూరెన్స్ ఉంటుందని అన్నారు. మైసూరు దసరా ఉత్సవాల సందర్బంగా ఏనుగులతో నగరంలో ప్రదక్షణ చేస్తారు.

ఆ సందర్బంలో పొరపాటున ఏమైనా నష్టం జరిగితే ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. మొదటి కంతుగా రూ. 55 వేలు ప్రీమియం చెల్లించారు. దసరా ఉత్సవ కమిటి ఈ ప్రీమియం చెల్లిస్తుందని అధికారులు అన్నారు.
జుంబు సవారి లో 750 కేజీల బరువు ఉన్న అంబారిని అర్జున అనే ఏనుగు మోసుకుని వెళుతుంది. మగ ఏనుగుకు రూ. 3.5 లక్షలు, ఆడ ఏనుగుకు రూ. 2.5 లక్షల చోప్పున ఇన్సూరెన్స్ చేయించారు. గత సంవత్సరం దసరా ఉత్సవాల ఏనుగులకు రూ. 40 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించారు.












Click it and Unblock the Notifications