Mysuru gangrape: పోలీసులకు రూ. 5 లక్షలు రివార్డు, స్టార్ హీరో లక్ష, రేప్ కేసులో బాలనేరస్తుడు !
బెంగళూరు: బాయ్ ఫ్రెండ్ తో వెలుతున్న ఎంబీఏ కాలేజ్ అమ్మాయిని నిర్జన ప్రదేశంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కామాంధులను అరెస్టు చేసిన పోలీసుల తీరును ప్రజలు అభినందిస్తున్నారు. ఇప్పటికే మైసూరు కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ తో సహ ఐదు మందిని అరెస్టు చేసిన పోలీసులకు కర్ణాటక డీజేపీ ప్రవీణ్ సూద్ రూ. 5 లక్షలు బహుమానం ప్రకటించారు. కన్నడ ప్రముఖ హీరో, బీజేపీ నాయకుడు జగ్గేష్ కూడా ఇప్పుడు గ్యాంగ్ రేప్ కేసు విచారణలో నిందితులను అరెస్టు చేసిన పోలీసులకు రూ. 1 లక్ష బహుమానం ప్రకటించారు. కర్ణాటక పోలీసులు ఎప్పుడు వారి శక్తికి మంచి పని చేస్తారని మరోసారి నిరూపించుకున్నారని. గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు పక్క రాష్ట్రానికి పారిపోయి తప్పించుకోవడానికి ప్రయత్నించినా చివరికి తప్పించుకోలేకపోయారని, ఎప్పటికైనా కర్ణాటక పోలీసులు గ్రేట్ అని ప్రముఖ హీరో జగ్గేష్ అన్నారు.

మైసూరు గ్యాంగ్ రేప్ కలకలం
మైసూరు సమీపంలోని చాముండి కొండ సమీపంలోని లలితాద్రిపురంలో రోడ్డు పక్కన కాలేజ్ అమ్మాయి, ఆమె బాయ్ ఫ్రెండ్ నిలబడి ఉన్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో వెళ్లిన ఆరు మంది కామాంధులు కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మీద దాడి చెయ్యడంతోవారు హడలిపోయారు. తరువాత అమ్మాయి మీద కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు.

పిన్ టూ పిన్ చెప్పిన బాయ్ ఫ్రెండ్
ఇప్పటికే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అనే విసయం పోలీసులకు చెప్పాడు. తన మీద దాడి చేసిన తరువాత ఇద్దరినీ లలితాద్రిపురంలోని నిర్జనప్రదేశంలోకి లాక్కొని వెళ్లారని చెప్పాడు. తన మీద బండరాయితో దాడి చేసి చితకబాదేశారని, తాను స్పృహ తప్పి పడిపోయారని, తరువాత తనస్నేహితురాలిని నిర్జనప్రదేశంలోని లాక్కొని వెళ్లారని పోలీసులకు చెప్పాడు.

నిందితులకు మంచి చాన్స్ చిక్కింది
రాత్రి పూట జనసంచారం తక్కువగా ఉండటంతో కామంధులు రెచ్చిపోయారు. కాలేజ్ అమ్మాయి మీద ఒకరి తరువాత ఒకరు ఆరు మంది సామూహిక అత్యాచారం చేసి రాక్షసుల్లా వారి కామం తీర్చుకున్నారు. స్పృహలోకి వచ్చిన సమయంలో తన పక్కన ఇద్దరు నిలబడి ఉన్నారని, మిగిలిన వాళ్లు ఆ అమ్మాయిని పొదల్లో నుంచి బయటకు తీసుకు వచ్చారని బాధితురాలి స్నేహితుడు పోలీసులకు చెప్పాడు.

పట్టించిన బస్ టిక్కెట్.... బీరు బాటిల్స్
గ్యాంగ్ రేప్ జరిగిన ప్రాంతంలో పోలీసులకు బీర్ బాటిల్స్, బస్ టిక్కెట్లు చిక్కాయి. మైసూరు గ్యాంగ్ రేప్ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపడంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో నిందితులు మైసూరు నుంచి చామరాజనగర, తరువాత అక్కడి నుంచి తమిళనాడు, కేరళ పారియిఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నిందితులను అరెస్టు చెయ్యడానికి పోలీసులు మూడు రోజుల నుంచి అనేక ప్రయత్నాలు చేశారు.

ఐదు మంది అరెస్టు..... రేప్ కేసులో బాల నేరస్తుడు
సు విచారణ చేస్తున్న పోలీసు అధికారి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్ లు తమిళనాడు వెళ్లి రహస్య ప్రాంతంలో తలదాచుకున్న ఐదు మంది కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన ఐదు మందిలో ఒక మైనర్ కూడా ఉన్నాడని పోలీసు అధికారులు చెప్పారు. పరారైన మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసులకు రూ. 6 లక్షలు బహుమానం
మైసూరు కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ తో సహ ఐదు మందిని అరెస్టు చేసిన పోలీసులకు కర్ణాటక పోలీసు డీజీపీ ప్రవీణ్ సూద్ రూ. 5 లక్షలు బహుమానం ప్రకటించారు. కన్నడ ప్రముఖ హీరో, బీజేపీ నాయకుడు జగ్గేష్ కూడా ఇప్పుడు గ్యాంగ్ రేప్ కేసు విచారణలో నిందితులను అరెస్టు చేసిన పోలీసులకు రూ. 1 లక్ష బహుమానం ప్రకటించారు. కర్ణాటక పోలీసులు ఎప్పుడు వారి శక్తికి మంచి పని చేస్తారని మరోసారి నిరూపించుకున్నారని. గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు పక్క రాష్ట్రానికి పారిపోయి తప్పించుకోవడానికి ప్రయత్నించినా చివరికి తప్పించుకోలేకపోయారని, ఎప్పటికైనా కర్ణాటక పోలీసులు గ్రేట్ అని ప్రముఖ హీరో జగ్గేష్ అన్నారు.












Click it and Unblock the Notifications