మైసూరు మహారాజు ఆస్తులు ఎంతంటే?, మైండ్ బ్లాక్, బీజేపీ అభ్యర్థిగా నామినేషన్, భార్య ఆస్తి!
మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా మైసూరు మహారజ వంశస్తుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. యదువీర్ ఒడయార్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన ఆస్తులను ప్రకటించారు. యదువీర్ నామినేషన్ సమర్పించే సమయంలో ఆయన తల్లి మైసూరు మహారాణి ప్రమోదా దేవి ఒడయార్ తన కుమారుడి వెంట వెళ్లి ఆయనకు మద్దతు పలికారు.
నామినేషన్ దాఖలు చేసే సమయంలో యదువీర్ వడయార్ తన ఆస్తులు రూ.5 కోట్లుగా ప్రకటించారు. తనకు ఇల్లు, వ్యవసాయ భూమి, ప్లాట్లు లేవని యదువీర్ వడయార్ తన అఫిడవిట్‌లో తెలియజేశారు.

రూ.3.25 కోట్ల విలువైన 4 కిలోల బంగారం, చేతిలో రూ.లక్ష నగదు ఉన్న యదువీర్ వడయార్ వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.36 కోట్లు ఉన్నాయి. ఇది కాకుండా యదువీర్ దగ్గర రూ.3. 25 కోట్ల విలువైన 4 కిలోల బంగారం, రూ.14 లక్షల విలువైన 20 కిలోల వెండి ఉంది.
యదువీర్ వడయార్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసే సమయంలో తన ఆస్తి మొత్తం రూ.4.99 కోట్ల ప్రకటించారు. మైసూరు మహారాజు యదువీర్ ఒడయార్ భార్య త్రిషిక ఆస్తి కూడా ప్రకటించారు.
త్రిషిక దగ్గర 75 వేల నగదు, లక్ష రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. త్రిషిక వద్ద రూ.5. 5 లక్షల విలువైన 100 గ్రాముల ఆభరణం, రూ.90 లక్షల విలువైన 2 కిలోల బంగారం, రూ.7 లక్షల విలువైన 10 కిలోల వెండి ఉన్నాయి.
త్రిషిక ఆస్తుల విలువ రూ.1.04 కోట్లు అని ప్రకటించారు. ఈ ఆస్తి వివరాలతో మైసూరు మహారాజ యదువీర్ ఒడయార్ నామినేషన్ పత్రాలను సమర్పించే సమయంలో తనపై ఆధారపడిన వారి ఆస్తులను కూడా ప్రకటించారు. బ్యాంకులో రూ.లక్ష, మ్యూచువల్ ఫండ్‌లో రూ.1.49 కోట్లు, టాటా లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.1.89 కోట్లు ఉన్నాయని మైసూరు మహారజ యదువీర్ ఒడయార్ ప్రకటించారు. మైసూరు- కొడుగు లోక్ సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి యదువీర్ ఒడయార్ ను గెలిపించాలని సిట్టింగ్ ఎంపీ .
ప్రతాప్ సింహా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా మూడోసారి ఎంపీ టికెట్ ఆశించించడంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించింది. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా స్థానంలో మైసూరు మహారాజుల వంశీయుడు యదువీర్ వడయార్ కు బీజేపీ హైకమాండ్ టిక్కెట్ ఇచ్చింది. జ్యోతిష్యుల సూచనతో సోమవారం చాలా సింపుల్ గా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించిన యదువీర్ ఒడయార్ ఇదే నెల 3వ తేదీన మద్దతుదారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఊరేగింపు వెళ్లి మరోసారి నామినేషన్ వేస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications