వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీర్పును అర్థం చేసుకోలేదు: శ్రీనివాసన్‌కు సుప్రీం చురక, క్షమాపణ చెప్పాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శ్రీనివాసన్‌కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం చురకలు అంటించింది. సుప్రీం తీర్పు స్ఫూర్తిని శ్రీనివాసన్ అర్థం చేసుకున్నట్లుగా లేదని వ్యాఖ్యానించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవద్దని చెబితే సమావేశాలకు అధ్యక్షత ఎలా వహిస్తారని ప్రశ్నించింది.

శ్రీనివాసన్ బీసీసీఐ సమావేశాలకు హాజరు కావడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. అధ్యక్షత ఎలా వహిస్తారని ప్రశ్నించింది. శ్రీనివాసన్ తీరు తీర్పును అగౌరవపరిచినట్లుగా ఉందని పేర్కొంది. దీని పైన శ్రీనివాసన్‌ను తాము వివరణ కోరుతామని తెలిపింది. ఫిబ్రవరి 8న శ్రీని బీసీసీఐ సమావేశానికి హాజరయ్యారు.

N Srinivasan Should not Have Presided Over BCCI Meeting, says Supreme Court

దీనికి శ్రీనివాసన్ క్షమాపణ చెప్పాలని సుప్రీం కోర్టు పేర్కొంది. శ్రీనివాసన్ ఆటకు గొప్ప సేవలు చేసి ఉండవచ్చునని, కానీ తమ తీర్పు తర్వాత ఆయన కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలన్నారు.

దీనిపై శ్రీనివాసన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ... ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, కేవలం ఎన్నికల కోసం తేదీని మాత్రమే ఫిక్స్ చేశారని చెప్పారు. శ్రీనివాసన్ హాజరీని ప్రశ్నిస్తూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ సమావేశానికి వచ్చిన శ్రీనివాసన్ శిక్షార్డు అని వారు అంటున్నారు.

English summary
The Supreme Court on Monday expressed its displeasure over Board of Control for Cricket in India (BCCI) president in-exile N. Srinivasan's chairing of the recent working committee meeting in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X