3- స్టేట్స్: ఈశాన్యం నుంచి మోగిన ఎన్నికల నగారా- బీజేపీకి అగ్నిపరీక్షే: మార్చి 2న..

న్యూఢిల్లీ: ఇది అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం. ఈ ఏడాది ఏకంగా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం లల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయాత్తమైంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగనుండటంతో అన్ని పార్టీలు కూడా ఈ తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోన్నాయి.

మూడు రాష్ట్రాల షెడ్యూల్..

మూడు రాష్ట్రాల షెడ్యూల్..

తొలి విడతలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఈ మూడు కూడా ఈశాన్య రాష్ట్రాలే. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ లల్లో ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్- కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

త్రిపురతో మొదలు..

త్రిపురతో మొదలు..

ఫిబ్రవరి 16వ తేదీన త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల- 27వ తేదీన నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ను ముగించేలా చర్యలు తీసుకుంది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు- మార్చ్ 2వ తేదీన వెలువడతాయి.

62 లక్షల మందికి పైగా ఓటర్లు..

62 లక్షల మందికి పైగా ఓటర్లు..

నాగాలాండ్, మేఘాలయా, త్రిపురల్లో కలిపి మొత్తం 62 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వారిలో 31.47 లక్షలు మహిళా ఓటర్లు ఉన్నారు. మిగిలిన వారిలో 97,000 మంది 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు ఉన్న వారు ఉన్నారు. 31,700 దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న వారి సంఖ్య 1.76 లక్షలు.

నామినేషన్ల వివరాలు..

నామినేషన్ల వివరాలు..

కాగా- త్రిపుర అసెంబ్లీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 21వ తేదీన వెలువడనుంది. ఒకే దశలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 30. 31వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. వాటిని ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2. అదే నెల 16వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. మార్చి 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మార్చ్ 2న భవితవ్యం..

మార్చ్ 2న భవితవ్యం..

నాగాలాండ్, మేఘాలయాల ఎన్నికల కోసం ఈ నెల 31వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 7. అదే నెల 8వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10. అదే నెల 27వ తేదీన పోలింగ్. మార్చ్ 2వ తేదీన త్రిపురతో కలిపి నాగాలాండ్, మేఘాలయా ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

మూడు రాష్ట్రాల్లో..

మూడు రాష్ట్రాల్లో..

ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. త్రిపురలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నాగాలాండ్, మేఘాలయాల్లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. నాగాలాండ్ లో నేషనల్ పీపుల్స్ పార్టీ, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. ఇందులో బీజేపీ భాగస్వామిగా ఉంది. మేఘాలయాలో యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+