ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగోబా: కొత్త కోడళ్లను నాగేంద్రునికి పరిచయం చేసే ఈ జాతర ఎలా జరుగుతుందంటే...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నాగోబా

ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి (జనవరి21) నాగోబా విగ్రహాన్ని గోదావరి జలాలతో అభిషేకించడంతో ప్రారంభమైంది.

నాగోబా జాతరను సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద ఆదివాసీ జాతరగా భావిస్తారు.

రాజ్‌గోండ్ ఆదివాసీ తెగలోని 'మేస్రం వంశస్తులు’ ప్రతీ ఏడాది ఈ జాతరను నిర్వహిస్తారు.

నాగోబాా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి ఈ జాతరకు ఆదివాసీలు తరలివస్తారు.

నాగ దేవతను పూజించే జాతర ఇది.

నాగోబా

పాత ఆలయం స్థానంలో సుమారు 5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన రాతి ఆలయంలో ఈసారి జాతరను నిర్వహిస్తున్నారు.

ఆలయ నిర్మాణ ఖర్చులను ఆదివాసీల నుంచి మూడేళ్లపాటు చందాల రూపంలో సేకరించారు.

నాగోబా

జాతరకు దూర ప్రాంతాల నుంచి కుటుంబాలతో ఎడ్లబండ్లపై తరలి వస్తారు. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్ల కింద బస చేస్తారు.

నిర్ణయించిన ముహూర్తానికి సంప్రదాయ వాయిద్యాలతో ఆలయ ప్రవేశం చేస్తారు.

నాగోబా

కొత్త కోడళ్ల ను నాగోబా దైవానికి పరిచయం చేసే కార్యక్రమాన్ని 'భేటింగ్’ అని పిలుస్తారు. తెల్లని వస్త్రాల్లో దైవ సన్నిధిలో కొత్త కోడళ్లను నాగోబాకు, తెగ పెద్దలకు పరిచయం చేస్తారు.

నాగోబా

జాతర చివరి రోజు 'దర్బార్’ ను నిర్వహిస్తారు. దర్బార్‌లో భాగంగా ఆదివాసీలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తారు.

నిజాం కాలం నుంచి ఈ దర్బార్ ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతోంది.

ఈ జాతరకు సంబంధించిన మరికొన్ని ఫొటోలు...

నాగోబా
నాగోబా
నాగోబా
నాగోబా
నాగోబా
నాగోబా
నాగోబా
నాగోబా
నాగోబా
నాగోబా

నాగోబా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Nagoba: How is this fair to introduce new daughter in law to Nagendra...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X