నమశ్శివాయ.. పుదుచ్చేరి నయా సీఎం..
పుదుచ్చేరి : ఐదు రాష్ట్రాల ఎన్నిల పలితాలు విడుదలయ్యాయి. బెంగాల్ లో దీదీ మమతా బెనర్జీ, తమిళనాడులో అమ్మ జయలలిత మరోమారు అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక కేరళలో గెలుపొందిన ఎల్.డీ.ఎఫ్ తరుపున అచ్యుతానందన్, విజయన్ ఇద్దరిని చెరో దఫా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే యోచనలో ఉంది పార్టీ. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ పుదుచ్చేరిలోను సీఎం ఎవరనే దానిపై ఇప్పుడిప్పుడే కాస్త స్పష్టత వస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. విల్లియనూర్ నుంచి గెలుపొందిన పుదుచ్చేరి పీసీసీ చీఫ్ నమశ్శివాయను సీఎం ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి 17 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పుదుచ్చేరి పీసీసీ చీఫ్ నమశ్శివాయ పేరు సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది.
ఇక గత సీఎం, ఏఐఎన్ఆర్సీ నేత రంగస్వామికి ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పలేదు. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ కేవలం 8 స్థానాకే పరిమితం కాగా.. అన్నాడీఎంకే 4 స్థానాలకు పరిమితమైంది.












Click it and Unblock the Notifications