బాలీవుడ్ డ్రగ్స్ కేసు ... తెరపైకి దియా మీర్జా పేరు ... ఆరోపణలను ఖండించిన మీర్జా
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు దర్యాప్తు విషాదకరమైన మలుపు తిరిగింది. రియా చక్రవర్తి తొలగించిన వాట్సాప్ చాట్ నుండి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తీగ లాగితే డొంకంతా కదులుతుంది. అటు బాలీవుడ్ , ఇటు టాలీవుడ్ తాజా పరిణామాలతో షేక్ అవుతుంది . సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు డ్రగ్స్ ఇచ్చినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో విచారణ జరుపుతున్నాయి. రియా చక్రవర్తిని, అలాగే సుశాంత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయా సాహాను విచారిస్తున్న క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

తెరపైకి దియా మీర్జా కేసు
బాలీవుడ్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ చేస్తోంది. ఈ విచారణలో తాజాగా కొత్త పేర్లు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఈ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ , సారా అలీ ఖాన్ ల పేర్లు వినపడగా , నిన్నటికి నిన్న ఈ డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనే పేరు బయటకు వచ్చింది . ఇక తాజాగా నటి దియామీర్జా పేరు తెరపైకి రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

డీకోడ్ చేసే పనిలో ఎన్‌సీబీ
బాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, దియా మీర్జా వంటి సెలబ్రిటీల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ డ్రగ్స్ కేసులో కోడ్ భాషలో ఉన్న అక్షరాలను డీకోడ్ చేస్తూ ఒక్కొక్క బాలీవుడ్ హీరోయిన్ పేరును గుర్తించే ప్రయత్నం చేస్తోంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ నేపథ్యంలోనే తాజాగా విచారణ నిమిత్తం దియా మీర్జాకు ఎన్‌సీబీ సమన్లు పంపనున్నట్లుగా సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధించి మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహాను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్న క్రమంలో పలువురు బాలీవుడ్ నటీమణుల పేర్లు బయట పడుతున్నట్లు సమాచారం. జయ సాహా వాట్సాప్ గ్రూపు లో ఉన్న కోడ్ లను డీకోడ్ చేసి ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్న వారి పేర్లను ఒక్కొక్కరిని గుర్తిస్తున్నారు. ఇప్పటికే దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు సమన్లు జారీ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరు కావాలని పేర్కొంది.
Recommended Video

చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనని లాగినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దియా మీర్జా పేర్కొన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని వచ్చిన వార్తలు తప్పుడు వార్తలని ఆమె చెప్పారు. నిరాధారమైన వార్తలు ప్రచారం చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దియా మీర్జా హెచ్చరించారు. జయ సాహా వాట్సాప్ గ్రూప్స్‌లో చాట్‌లను జాతీయ మీడియా ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకురావడంతో ఈ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications