వెక్కి వెక్కి ఏడ్చిన నారా చంద్రబాబు నాయుడు.. ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకిలో అడుగు పెడతా’

అసెంబ్లీలో ప్రతిపక్షాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని, ఇలాంటి అసెంబ్లీలోకి మళ్లీ అధికారంలోకి వచ్చాకే అడుగుపెడతాననిఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతటి ఘోరమైన సభను తాను ఇంత వరకు చూడలేదని, అధికార పార్టీ దీనిని కౌరవ సభలా నిర్వహిస్తోందని, ఆఖరికి ప్రతిపక్ష నేత కుటుంబంలోని మహిళలను కూడా సభలో ప్రస్తావిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య గురించి అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని గుర్తు చేసిన చంద్రబాబు నాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 'ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతా’ అంటూ వాకౌట్ చేశారు.
''నా భార్య రాజకీయాల్లోకి రాలేదు. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి లేదు. వాళ్ల నాన్న రాజకీయాల్లో ఉన్నా, నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రొటొకాల్ సమయంలో తప్ప ఆమె ఏ కార్యక్రమంలోనూ కనపబడేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు ఆమెకు తెలియదు. ఆవిడ పని ఆమె చూసుకుంటారు. నలుగురికి సాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఆమెకు మరొకటి తెలియదు. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం'' అని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్నారు.
మన ఇంటి ఆడవాళ్లని ఏదైనా అంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు. సభను, సభ్యులను అదుపులో పెట్టాల్సిన స్పీకర్ తమ్మినేని తన గతాన్ని మర్చిపోయి వ్యవహరించారని, ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.
ఇది ధర్మానికి , అధర్మానికి జరుగుతున్న యుద్ధమని, ప్రజాక్షేత్రంలోనే దీన్ని తేల్చుకుంటామని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కూడా తన మీదా, తన కుటుంబంపైనా ప్రభుత్వం దాడి చేస్తుందని ఆయన అన్నారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించడం తనకు కొత్త కాదని చంద్రబాబు అన్నారు.
''40 ఏళ్లు రాజకీయాల్లో ఉంది ఇలాంటి పరిస్థితులను చూడటానికా'' అని చంద్రబాబు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. బూతులు మాట్లాడటం తమకు చేతకాక కాదని, విలువలు కట్టుబడి ఉన్నాం కాబట్టే క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.
''ఈ ధర్మపోరాటంలో ప్రజలు నాతో సహకరించాలి. ధర్మక్షేత్రంలో అధికార పార్టీతో తేల్చుకున్నాకే అసెంబ్లీలో అడుగు పెడతా'' అని చంద్రబాబు నాయుడు ప్రతిజ్జ చేశారు.
ఇవి కూడా చదవండి:
- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం: ప్రధాని మోదీ
- ఆంధ్రప్రదేశ్: దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్ష బీభత్సం, మనుషులు గల్లంతు... కొట్టుకుపోతున్న మూగజీవాలు
- అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్
- దుస్తులు తొలగించకుండా తాకినా లైంగికంగా వేధించినట్లే: సుప్రీంకోర్టు
- ఎవరు మీలో కోటీశ్వరులు: రూ. కోటి గెల్చుకున్న రాజా రవీంద్ర బీబీసీ అడిగిన 5 ప్రశ్నలకు ఏమని బదులిచ్చారు?
- తైవాన్ 'పాల సముద్రం’: సుందర ద్వీపం కింద విషం చిమ్మే సాగర రహస్యం
- 'పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- కేసీఆర్ ధర్నా చౌక్ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది?
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications