ప్రభుత్వం అల్లుడిదా, కొడుకుదా?: షీలాపై మోడీ చురక

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉన్నది కొడుకు ప్రభుత్వామా? అల్లుడి ప్రభుత్వామా? తల్లి ప్రభుత్వమా? అర్థం కావడం లేదని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. మోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని జపానీస్ పార్క్ వద్ద నిర్వహించిన వికాస్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. షీలా దీక్షిత్‌కు ఉదయం, సాయంత్రం రిబ్బన్ కటింగ్‌లు తప్ప వేరే పనిలేదని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో నిర్భయలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే షీలా ప్రభుత్వం వైఫల్యమే కారణమన్నారు. మహిళలు తొందరగా ఇంటికి చేరుకోవాలని షీలా చెప్పడం ఆమె నిర్లాక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు. శాంతిభద్రతలు ఢిల్లీలో లేవన్నారు. ఢిల్లీలో ఒక్కో శాఖ ఒక్కో ప్రభుత్వం అనుకుంటున్నాయన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు గొడవపడుతున్నాయని ధ్వజమెత్తారు. విద్యుత్ కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.

Narendra Modi

సాక్షాత్తు ప్రధాని ఇంట్లోనే జనరేటర్ నడుస్తోందన్నారు. విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి పెట్టడంలేదని, బొగ్గు, గ్యాస్ అందుబాటులో లేక అనేక విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయని, దీనికి కేంద్ర విధానాలే కారణమని మోడీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసి పేద దేశానికి ప్రధానినని మన్మోహన్‌సింగ్ చెప్పడం దారుణమని, భారత్ ఏ విషయంలో పేద దేశమో చెప్పాలని మోడీ డిమాండ్ చేశారు.

మన్మోహన్‌ను ఉద్దేశించి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరమని, మన ప్రధానిపై మనం ఎన్నైనా విమర్శలు చేస్తామని, దాయాది దేశ ప్రధాని మన ప్రధానిని కించ పరిచే విధంగా మాట్లాడడం దుస్సాహసమే అన్నారు. మన ప్రధానిని కించపరుస్తూ నవాజ్ షరీఫ్ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న భారత్ మీడియా ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

యూపిఏ మొదటి నుండి తప్పులు చేస్తోందని అయినా భరిస్తున్నామని, యూపిఏ డర్టీ టీమ్‌లని, 2014 ఎన్నికల్లో ప్రజలు డ్రీమ్ టీమ్‌ను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహించుకుందామని మోడీ అన్నారు. అమృతోత్సవాలంటే యువతకు ఉపాధి, 65 ఏళ్లు నిండినవారు హాయిగా జీవించడం, ప్రతి ఇంటిలోనూ మూడు పూటలా భోజనం, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యమన్నారు. తాను శాసనకర్తను కావాలనుకోవడం లేదని, ప్రజా సేవకుడినని, ఎప్పుడూ అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పారు.

మన్మోహన్ సింగ్ అసమర్థ ప్రధాని అని, భారత్ తర్వాత స్వాతంత్య్రం సాధించిన దేశాలు అభివృద్ధి పథంలో దూసుకు పోతుంటే మనం వెనక్కి వెళ్తున్నామన్నారు. ఎన్డీయే హయాంలోని మిత్ర పక్షాలు అన్నిటిని కలుపుకుని దేశాభివృద్ధికి పాటుపడ్డామని ఆయన అన్నారు. రైల్వేల అభివృద్ధిలో చైనా జపాన్‌తో పోటీ పడుతుంటే మనం ఎక్కడున్నామని ప్రశ్నించారు. దేశానికి ఇప్పుడు మంచి పరిపాలన కావాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+