Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌లో అభినందనలు తెలుపుతూ మన్మోహాన్ సింగ్‌ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని మోడీ ఆకాంక్షించారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Best wishes & warm greetings to Dr. Manmohan Singh ji on his birthday. May he be blessed with a long life & good health.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/515358397521080320">September 26, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

తన ఐదు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఫ్రాంక్ ఫర్ట్, జర్మనీకి చేరుకున్నారు. 29న వాషింగ్టన్ వెళతారు. శనివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో తొలిసారి ప్రసంగిస్తారు.

ఈ ప్రసంగంలో మోడీ ఐరాసలో వేగంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని గురించి ప్రస్తావించనున్నట్లు తెలిపారు. రెండు దేశాలు ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై ఒబామాతో చర్చిస్తారు.

ఇక ఈనెల 29న అమెరికా అధ్యక్షడు బరాకా ఒబామా మోడీకి ప్రైవేటు విందు ఇస్తున్నారు. మరుసటి రోజు శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. భారత్‌లో నవరాత్రుల రోజుల్లో ప్రధాని మోడీ ఉపవాస దీక్షలో ఉంటారు.

Narendra Modi meets America: 6 things to look out for

దీంతో విందులో మోడీ టీ, నిమ్మరసం మాత్రమే తీసుకుంటారు. మరోపక్క మోడీ, ఒబామా భేటీపై వాషింగ్టన్‌‌లో అంచనాలు భారీగా పెరిగాయి. నరేంద్ర మోడీ ఈ పర్యటనలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, భారత్ అమెరికన్ అయిన దక్షిణ కరోలైనా గవర్నర్ నిక్కీ హేలీ సహా అమెరికాలోని రాజకీయ నాయకులను కలుసుకోనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. 1994లో అమెరికాలో పర్యటించారు. అమెరికాలో మోడీ పర్యటించడం ఇదో రెండో సారి. 1994లో మన దేశం నుంచి ఆరుగురు యువ రాజకీయనేతలు అమెరికాకు వెళ్లారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ నేతలు కాగా... మిగిలిన వారు బీజేపీకి చెందిన వారు. బీజేపీ తరపున ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత కేంద్ర మంత్రి అనంతకుమార్ ఈ పర్యటనకు ఎంపికయ్యారు.

41 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రలో వీరంతా అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించారు. తొలుత ఫ్రాన్స్ పర్యటించిన అనంతరం 'అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్' అధికారిక ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లారు. ఈ వివరాలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అప్పట్లో నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. కిషన్ రెడ్డి బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా పనిచేసేవారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+