Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'మేక్ ఇన్ ఇండియా'లో మోడీ ఏం చెప్పారు (పిక్చర్స్)

న్యూఢిల్లీ: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌లో ఏర్పాటు చేసిన "మేక్ ఇన్ ఇండియా" ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గోన్నారు. భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత్‌ను ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా మలిచే లక్ష్యంతో 'మేక్ ఇన్ ఇండియా'కు మోడీ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

దేశంలోని అగ్రస్థాయి పారిశ్రామికవేత్తలైన అనిల్ అంబానీ, కుమార మంగళం బిర్లా, సైరస్ మిస్త్రీ, అదానీ, హిందుజా, అజీం ప్రేమ్ జీ, కిరణ్ మజుందార్ షా తదితరులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలకు చెందిన 500 మంది సీఈఓలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, మేక్ ఇన్ ఇండియా నినాదం కాదని, చిత్తశుధ్దికి నిదర్శమని అన్నారు. భారత్‌ను ఉత్పత్తుల కేంద్రంగా తయారు చేసేందుకు చిత్తశుద్దితో ఉన్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రారంభించేందుకు నిబంధనలు సరళతరం చేస్తామని, కార్మక చట్టాలకు సవరణలు తెస్తామని అన్నారు. భారతదేశంలో పారిశ్రామిక అభివృద్దిపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది.

ప్రచార కార్యక్రమంలో భాగంగా మేక్ ఇన్ ఇండియా వెబ్‌సైట్, లోగోను మోడీ ఆవిష్కరించారు. అనంతరం నరేంద్ర మోడీ మాట్లాడుతూ 'మేక్ ఇన్ ఇండియా' ప్రచార కార్యక్రమానికి ఉత్తేజితులై వచ్చిన పారిశ్రామికవేత్తలందరికీ నరేంద్ర మోడీ నమస్కారం తెలిపారు. ఇంత మంది పెద్దలు చెప్పింది విన్న తర్వాత నేను కొత్తగా ఇచ్చే భరోసా ఏమీ లేదనిపిస్తోంది. మన పెట్టుబడులు ఇతర దేశాలకు తరలివెళ్లినప్పుడు తీవ్రమైన బాధ కలుగుతుంది.

మన వ్యవసాయ రంగం కుంటుపడింది. ఇలా ఎందుకైందో అర్థం కాలేదన్నారు. రాజకీయాల వల్లే అయిందా అంటే అదేమి కాదు. స్వశక్తిపై నమ్మకం పోతే నిలబెట్టడం కష్టమని మోడీ అన్నారు. ఓ విషవలయంలో రైతులు ఇరుక్కుపోయారని మోడీ వ్యాఖ్యానించారు. ఈ విషవలయాన్ని చేధించాల్సిన అవసరం ఉందన్నారు.. మనం సామాజిక బాధ్యత గురించి మాట్లాడేటప్పుడు, పారిశ్రామిక రంగంపై ప్రభుత్వ బాధ్యత ఏమిటన్నది ఆలోచించాలని అన్నారు.

ఉపాధి అవకాశాలతో పాటే ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అప్పుడే ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మేక్ ఇన్ ఇండియా అంటే "మా దేశానికి రండి... ఇక్కడ ఉత్పత్తులు తయారుచేసుకోండి.. ప్రపంచమంతా విక్రయించుకోండి.'' అని అర్దం.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అనంతరం నరేంద్ర మోడీ మాట్లాడుతూ 'మేక్ ఇన్ ఇండియా' ప్రచార కార్యక్రమానికి ఉత్తేజితులై వచ్చిన పారిశ్రామికవేత్తలందరికీ నరేంద్ర మోడీ నమస్కారం తెలిపారు. మన వ్యవసాయ రంగం కుంటుపడింది. ఇలా ఎందుకైందో అర్థం కావడం లేదని అన్నారు.

 నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

మేక్ ఇన్ ఇండియా నినాదం కాదని, చిత్తశుధ్దికి నిదర్శమని అన్నారు. భారత్‌ను ఉత్పత్తుల కేంద్రంగా తయారు చేసేందుకు చిత్తశుద్దితో ఉన్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రారంభించేందుకు నిబంధనలు సరళతరం చేస్తామని, కార్మక చట్టాలకు సవరణలు తెస్తామని అన్నారు.

 సైరస్ మిస్త్రీ

సైరస్ మిస్త్రీ

దేశంలో మానవ వనరులు, విస్తృత వనరులు, మార్కెట్‌కు సానుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ కట్టుబడి ఉందని స్ఫష్టం చేశారు.

 ముకేశ్ అంబానీ

ముకేశ్ అంబానీ

ముకేశ్ అంబానీ మాట్లాడుతూ భారత్‌లో పారిశ్రామిక అభివృద్దికి ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న చొరవ అభినందనీయం అంటూ కొనియాడారు. భారత్ పారిశ్రామిక రంగంలో అతి పెద్దదైన రిలయన్స్ సంస్ద నుంచి 165 దేశాలకు రూ. 2.65 లక్షల కోట్ల ఎగుమతులు చేస్తున్నామని అన్నారు. భారత్‌ను డిజిటల్ ఇండియాగా తయారు చేస్తామని స్వాతంత్ర్యం దినోత్సవం సందర్బంగా ప్రధాని ప్రకటించారని... అందుకు తమ వంతు సహకారమందిస్తామని అన్నారు.

 చందా కొచ్చర్

చందా కొచ్చర్

'మేక్ ఇన్ ఇండియా' అన్న ఆలోచన తమను ఉత్తేజితులను చేసిందని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ అన్నారు. పోటీ ధరలకు వస్తు ఉత్పత్తి చేయగలిగినప్పుడు మన స్దాయి మార్కెట్ సాధించగలుగుతామన్నారు. ఉత్పాదక సంస్దలు, బ్యాంకర్లు కలిసి పనిచేస్తే గొప్ప అవకాశాలుంటాయని అన్నారు.

కుమార మంగళం బిర్లా

కుమార మంగళం బిర్లా

బిర్లా కంపెనీలు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్దాయి నాణ్యతకు పెట్టింది పేరని అన్నారు. అంతర్జాతీయ సంస్దలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి తరుణమని పేర్కొన్నారు.

 అజీమ్ ప్రేమ్‌జీ

అజీమ్ ప్రేమ్‌జీ

ప్రపంచంలో అత్యుత్తమ హైడ్రాలిక్ టెక్నాలజీని విప్రో అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్తుత్తమమైన సేవలు అందించే సంస్దల్లో విప్రో ఒకటని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+