Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీఎంఓ అధికారులతో ప్రధాని మోడీ న్యూ ఇయర్ స్పెషల్ (ఫోటోలు)

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తన తొలి నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. నూతన సంవత్సర సందర్భంగా ప్రధాని మోడీ తన ప్రధాని కార్యాలయం (పీఎంఓ) అధికారులకు టీ పార్టీ ఇచ్చారు. వాటి వివరాలు వన్ఇండియా పాఠకులకు ప్రత్యేకం.

ప్రధానమంత్రి నివాసం 7 రేస్ కోర్సు రోడ్డులో ఉన్న విషయం తెలిసిందే. ఆ నివాసంలో ఉన్న పంచవతి ఆడిటోరియంలో ప్రధాని మోడీ ప్రిన్పిపల్ సెక్రటరీ నుంచి తక్కువ సిబ్బంది వరకు ఈ టీ పార్టీకి ఆహ్వానించారు. ఈ టీ పార్టీలో తన ఏడు నెలల పరిపాలను గురించి వారితో మట్లాడటం, వారి వద్ద నుంచి సలహాలు తీసుకోవడం లాంటివి చేశారని ఓ ఉన్నతాధికారి వన్ఇండియాకు చెప్పారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మోడీ గుజరాతీ న్యూ ఇయర్‌కు తన సీఎంఓ కార్యాలయ అధికారులతో టీ పార్టీ ఇవ్వడం, వారితో మాట్లాడటం వంటివి చేశారని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత ఆ సాంప్రదాయాన్నే మోడీ కొనసాగించారని తెలిపారు.

పంచవతి ఆడిటోరియంలో కేవలం ఒకే ఒక్క కుర్చీని ప్రధాని మోడీ కూర్చునేందుకు వేశామని... ఐతే ఆయన కూర్చుకుంటే ప్రతి ఒక్కరితో నిల్చోనే మాట్లాడారని మరొక అధికారి తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు మోడీ మాతో పాటే నుంచోని ప్రతి ఒక్కరితో కరచాలనం చేసి, మంచి పరిపాలన ప్రజలకు అందించడంలో తన టీమ్ అందిస్తున్న సహాకారం మరువలేదని అన్నారని తెలిపారు.

ఈ సందర్భంలో మోడీ మాట్లాడుతూ "మీరు ఏమి అడగాలని అనుకుంటున్నారో అడగండి. గత ఏడు నెలల మీ ఆలోచనలు, అనుభవాలను నాతో పంచుకోండి" అని అన్నారు. దీంతో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ ఆఫీసర్ తనకు వచ్చిన ఈ మెయిల్‌ను మోడీకి చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో ఈశాన్య రాష్ట్రాల్లో మీ పర్యటన తర్వాత... ఆయా రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ముఖ్యంగా ఆయా రాష్ట్రాలను టూరిజం హాబ్‌గా ఎదిగేందుకు మరింత తోడ్పాటు అందించాలని కోరారని తెలిపారు.

వీటితో పాటు పీఎంఓ అధికారులు ప్రధాని మోడీ ఏమమి తింటారు, ఎంత సేపు నిద్రపోతారని విషయాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆయన కుర్తా గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. మోడీ పీఎంఓ అధికారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

 పీఎంఓ అధికారులతో ప్రధాని మోడీ న్యూ ఇయర్ స్పెషల్

పీఎంఓ అధికారులతో ప్రధాని మోడీ న్యూ ఇయర్ స్పెషల్

ప్రధానమంత్రి నివాసం 7 రేస్ కోర్సు రోడ్డులో ఉన్న విషయం తెలిసిందే. ఆ నివాసంలో ఉన్న పంచవతి ఆడిటోరియంలో ప్రధాని మోడీ ప్రిన్పిపల్ సెక్రటరీ నుంచి తక్కువ సిబ్బంది వరకు ఈ టీ పార్టీకి ఆహ్వానించారు. ఈ టీ పార్టీలో తన ఏడు నెలల పరిపాలను గురించి వారితో మట్లాడటం, వారి వద్ద నుంచి సలహాలు తీసుకోవడం లాంటివి చేశారని ఓ ఉన్నతాధికారి వన్ఇండియాకు చెప్పారు.

 పీఎంఓ అధికారులతో ప్రధాని మోడీ న్యూ ఇయర్ స్పెషల్

పీఎంఓ అధికారులతో ప్రధాని మోడీ న్యూ ఇయర్ స్పెషల్

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మోడీ గుజరాతీ న్యూ ఇయర్‌కు తన సీఎంఓ కార్యాలయ అధికారులతో టీ పార్టీ ఇవ్వడం, వారితో మాట్లాడటం వంటివి చేశారని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత ఆ సాంప్రదాయాన్నే మోడీ కొనసాగించారని తెలిపారు.

 పీఎంఓ అధికారులతో ప్రధాని మోడీ న్యూ ఇయర్ స్పెషల్

పీఎంఓ అధికారులతో ప్రధాని మోడీ న్యూ ఇయర్ స్పెషల్

పంచవతి ఆడిటోరియంలో కేవలం ఒకే ఒక్క కుర్చీని ప్రధాని మోడీ కూర్చునేందుకు వేశామని... ఐతే ఆయన కూర్చుకుంటే ప్రతి ఒక్కరితో నిల్చోనే మాట్లాడారని మరొక అధికారి తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు మోడీ మాతో పాటే నుంచోని ప్రతి ఒక్కరితో కరచాలనం చేసి, మంచి పరిపాలన ప్రజలకు అందించడంలో తన టీమ్ అందిస్తున్న సహాకారం మరువలేదని అన్నారని తెలిపారు.

పీఎంఓ అధికారులతో ప్రధాని మోడీ న్యూ ఇయర్ స్పెషల్

పీఎంఓ అధికారులతో ప్రధాని మోడీ న్యూ ఇయర్ స్పెషల్

ఈ సందర్భంలో మోడీ మాట్లాడుతూ "మీరు ఏమి అడగాలని అనుకుంటున్నారో అడగండి. గత ఏడు నెలల మీ ఆలోచనలు, అనుభవాలను నాతో పంచుకోండి" అని అన్నారు. దీంతో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ ఆఫీసర్ తనకు వచ్చిన ఈ మెయిల్‌ను మోడీకి చెప్పారు.

జూన్ 21ని యోగా డేగా ప్రకటించడం వెనుక మోడీ కృషి, సన్‌సద్ ఆదర్శ గ్రామ్ యోజన లాంటి కార్యక్రమాల గురించి లో లెవల్ సిబ్బంది మోడీని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ ఐఎస్ఎస్ అధికారులకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మీరు బదిలీ మీద వెళుతున్నప్పుడు ప్రజలకు ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. అలా, ప్రధాని మోడీ 45 నిమిషాల పాటు పీఎంఓ అధికారులతో ముచ్చటించారు. టీ పార్టీ అనంతరం ప్రతి ఒక్క సిబ్బందితో ఓపికగా ఫోటోలకు ఫోజులిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+