మా ఒక్క రాష్ట్రంతో సమానం లేదు: కాంగ్‌పై మోడీ సెటైర్

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్ల కన్నా తమ పార్టీకి ఓ రాష్ట్రంలో వచ్చిన సీట్లు ఎక్కువ అని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అనంతరం ఆయన ట్విట్టర్‌లో తన సందేశముంచారు.

కాంగ్రెస్ లేని భారత్‌ను సాధించేందుకు ఇది అద్భుతమైన ప్రారంభమని ఆయన చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో 272 పైగా ఎంపీలను గెలుచుకొని కాంగ్రెస్ లేని భారత్‌ను సాధించాలనే కలను నెరవేర్చుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పట్ల తమ వ్యతిరేకతను ప్రజలు స్పష్టంగా చెప్పారన్నారు. మొత్తం ఎన్నికలు జరిగిన 589 అసెంబ్లీ స్థానాలకు గాను బిజెపి 408 స్థానాలను గెలుచుకుందని మోడీ వివరించారు.

Narendra Modi

‘ఇన్ని స్థానాలు గెలుచుకోవడం గొప్ప విజయమే. కాంగ్రెస్ కేవలం 23శాతం కూడా సాధించలేక మునిగిపోయింది' అని మోడీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ బిజెపి అధ్యక్షురాలు వసుంధరా రాజె, చత్తీస్‌గఢ్ సిఎం రమణ్ సింగ్‌లను ఆయన అభినందించారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడానికి మోడీ ప్రచారమే కారణమని అంతకుముందు బిజెపి సీనియర్ నాయకులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, గోపీనాథ్ ముండే అభివర్ణించారు. మోడీ పాపులారిటీ నుంచి ఈ ఎన్నికల్లో బిజెపి గణనీయంగా లబ్ధి పొందిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మోడీతో లాభం అంతో ఇంతో కాదన్నారు.

ఇక లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజలు తమ పార్టీకే పట్టం కట్టేందుకు మానసికంగా సిద్ధమైపోయారన్న సంకేతాన్ని నాలుగు రాష్ట్రాల విధానసభ ఎన్నికల ఫలితాలు వెలువరించాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో 68 శాతం సీట్లు బిజెపికి కట్టబెట్టి ప్రజలు తమకు మద్దతు తెలియజేశారని విలేఖరులకు తెలిపారు.

ప్రజలు సుపరిపాలన, అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పటానికి మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తమ పార్టీ సాధించిన విజయమే సాక్ష్యమన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత మచ్చుకైనా కనిపించలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందంటూ, ప్రభుత్వం అన్నిరంగాల్లో ఘోరంగా విఫలమైందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+