గుట్టుగా అశ్లీల నృత్యాలు.. రట్టు చేసిన పోలీసులు, అదుపులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంబంధీకులు

విలాసవంతమైన భవనంలో గుట్టుగా సాగుతున్న రేవ్ పార్టీని మహారాష్ట్ర లోని నాసిక్ పోలీసులు రట్టు చేశారు. పట్టుబడిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంబంధీకులు ఉన్నట్లు తెలుస్తోంది.

నాసిక్: విలాసవంతమైన భవనంలో గుట్టుగా సాగుతున్న రేవ్ పార్టీని మహారాష్ట్ర లోని నాసిక్ పోలీసులు రట్టు చేశారు. అసభ్యకర నృత్యాలు చేస్తున్న పలువురిని నాసిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంబంధీకులు ఉన్నట్లు తెలుస్తోంది. లగత్ పురి ప్రాంతంలో ఉన్న మిస్టిక్ విల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు.

Nashik: Striptease party busted, many related to top Maharashtra babus held

ఈ సందర్భంగా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న యువతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పార్టీలో పాల్గొన్న వారు మత్తు పదార్థాలు కూడా సేవించి ఉంటారన్న అనుమానంతో నిందితుల రక్త నమూనాలను సేకరించారు. నిర్వాహకులు ఆన్ లైన్ ద్వారా సంప్రదించి యువతులను పార్టీకి రప్పించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+