UPI: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నుంచి కొత్త ఫీచర్.. ఇక వారికి కష్టమే..!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్‌పీసీఐ) కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వ్యాపారులు డైరెక్ట్ గా పేమెంట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల థర్డ్ పార్టీ యాప్ లు అయిన ఫోన్ పే, గూగుల్ పే వినియోగం తగ్గే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ను ఉపయెగించి పేమెంట్ చేస్తే థర్డ్ పార్టీ యాప్ లు వాడాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు జొమాటో యాప్ ఏదైనా ఆర్డర్ పెడితే పేమెంట్ కోసం థర్డ్ పార్టా యాప్ లైన గూగుల్ పే లేదా ఫోన్ పే కు వెళ్లాల్సి ఉంటుంది.
అక్కడ పేమెంట్ చేసిన తర్వతా మళ్లీ జొమాటోకు తిరిగి రావాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పేమెంట్ ఫేయిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇలాంటి సమస్యలు ఉండవని ఎన్పీసీఐ చెబుతోంది. యూపీఐ ప్లగ్ ఇన్ లేదా మర్చంట్ ఎస్డికే ద్వారా మర్చట్లు ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు. దీంతో వర్చువల్ పేమెంట్ ద్వారా వ్యాపారులు డబ్బులు తీసుకొవచ్చు. అంటే ఇ కామర్స్, ఫుడ్ డెలవరీ యాప్ ల్లో పేమెంట్ చేస్తే థర్డ్ పార్టీ యాప్ వెళ్లకుండానే ఫుడ్ డెలవరీ, ఇ కామర్స్ యాప్ ల్లో డైరెక్ట్ గా పేమెంట్ చేయ్యొచ్చు.

మరోవైపు ఫోన్‌పే లాంటి కంపెనీలు ఈ ఫీచర్ వలన పెద్దగా ఉపయోగం లేదని ఫోన్ పే వంటి సంస్థలు చెబుతున్నాయి. మర్చంట్ యాప్‌లకు యూపీఐ ప్లగ్‌ఇన్ షిఫ్ట్ చేస్తోందని, సక్సెస్ రేటు పెరగడానికి టెక్నికల్‌గా పెద్ద మార్పులేవి లేవని ఫోన్‌పే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీఓ) రాహుల్ చారి తెలిపారు. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ లో ఫోన్ పే, గూగల్ పే గుత్తాధిపత్యం చేలాయిస్తున్నాయి. ఈ థర్డ్ పార్టీ యాప్ ల ఆధిపత్యం తగ్గించేందుకు ఎన్పీసీఐ అవకాశం కల్పించింది.
యూపీఐ పేమెంట్స్ లో ఏ కంపెనీ వాటా కూడా 30 శాతం దాటకూడదని ఎన్పీసీఐ నిబంధనలు తెచ్చింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే 2024 డిసెంబర్ 31 లోపు తమ వాటాను 30 శాతానికి తగ్గించుకోవాల్సి వస్తోంది. ఫోన్ పే ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌లో 47 శాతం వాటాతో మార్కెట్‌లో మొదటి స్థానంలో ఉంది. గూగుల్ పే 33 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications