అమరీందర్ సింగ్ ఓ కీలుబొమ్మ.. పంజాబ్‌లో బీజేపీకి అంతసీన్ లేదు.. ప్రత్యర్థులపై సిద్ధూ విసుర్లు
పంజాబ్‌లో రాజకీయం మరింత హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ విపక్షాలపై తన దూకుడును పెంచారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌పై ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఆయన బీజేపీ ఒక తోలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. అందుకే కెప్టెన్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని మండిపడ్డారు.

అమరేందర్ సింగ్ నమ్మకద్రోహి.
పంజాబ్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని నవజోత్ సింగ్ సిద్ధూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి అమరేందర్ సింగ్ కారణమని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని దుయ్యబట్టారు. కెప్టెన్ నమ్మక ద్రోహి అని మండిపడ్డారు. సిద్ధాంతాలను బీజేపీకి అమ్మేకున్నారని దుయ్యబట్టారు. కేసులు నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీకి కీలుబొమ్మగా మారారని విమర్శించారు.

పంజాబ్‌లో బీజేపీకి అంత సీన్ లేదు..
పంజాబ్‌లో బీజేపీకి ప్రజా బలం లేదన్నారు సిద్ధూ. ఇక్కడ ఎంతమాత్రమూ విజయం సాధించలేదని తేల్చిచెప్పారు. మాజీ సీఎం అమరేందర్ సింగ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీచేసినా కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపించదన్నారు. ప్రజలు కెప్టెన్‌ను చీదరించుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ అదిష్టానమే చూసుకుంటుందని తెలిపారు. ఎన్నిక సమయంలో సీఎం అభ్యర్థిని ప్రకటించదని స్ఫష్టం చేశారు.

కేజ్రీవాల్‌పై సిద్ధూ నిప్పులు
అటు ఢిల్లీ సీఎం అరంవింద్ కేజ్రీవాల్‌పై నవజోత్ సింగ్ సిద్ధూ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఆయన హామీలను ప్రజలు నమ్మరన్నారు. 18 ఏళ్ల వారికి రూ.1000 ఇస్తామన్న కేజ్రీవాల్.. 17 ఏళ్ల వారికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగానే అబద్ధపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. పంజాబ్ ఎన్నికలు సామాజిక, ఆర్థిక వ్యవస్థ పంజాబియత్‌తో ముడిపడి ఉందని పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు కృషి చేస్తోందన్నారు సిద్ధూ. మళ్లీ అధికారంలోకి రాగానే గృహిణిలకు ప్రతి నెల రూ 2000 నగదు ఇస్తామన్నారు. అంతే కాకుండా ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని చెప్పారు. బాలిక కోసం ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. 5వ తరగతి పూర్తి చేసిన బాలికలకు రూ.5000, పదో తరగతి పాసైతే రూ. 15 వేలు, 12వ తరగతి పాసైన యవతులకు రూ. 20 వేల నగదును ప్రోత్సహకం కింద అందిస్తామని సిద్ధూ ప్రకటించారు. ఉన్నత విద్య చదివే అమ్మాయిలకు స్కూటర్లు, కంప్యూటర్లు పంపిణీ చేస్తామని హామీలు గుప్పించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications