సిద్దూను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు: మాజీ సీఎం అమరీందర్ పరాజయం : దిగ్గజాల వెనుకంజ..!!
పంజాబ్ లో ఆప్ అనూహ్య విజయం నమోదు చేసుకుంది. 90 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు ఊహించని పరాజయం ఇది. కేవలం 17 సీట్లలోనే ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పరాజయంతో పీసీసీ చీఫ్ గా ఉన్న సిద్దూ తప పదవికి రాజీనామాకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. ఆయన తన అభిప్రాయాన్ని పార్టీకి లేఖ రూపంలో పంపనున్నారు. పంజాబ్ ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం అమరీందర్ పాటియాల నుంచి ఓటమి పాలయ్యారు. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

రాజీనామాకు సిద్దమైన సిద్దూ
అయితే అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌లో చాలా కాలం పాటు కొనసాగారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో ఓ పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొత్త పార్టీ పెట్టినా చివరకు పరాజయం పాలయ్యారు. ఇదే సమయంలో పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న ఆప్‌కు కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రజా గొంతుకే.. దేవుడి గొంతుక, పంజాబ్ ప్రజల అవసరాలను నిజాయితీగా అంగీకరిస్తున్నా అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.

సిద్దూ పై కాంగ్రెస్ నేతల ఫైర్
అదే సమయంలో సీఎం చన్నీ రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. శిరోమణి అకాలీ దళ్ ముఖ్య నేత బాదల్ సైతం వెనుకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ గ్రూపు రాజకీయంతో విసుగుపోయిన ప్రజలు ఆప్‌కే పట్టం కట్టారు. ఆది నుంచి కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టిన ఆప్ అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. పంజాబ్‌లో ఆప్ ఏకపక్ష విజయం సాధించగా, కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోయింది. పంజాబ్ సీఎం పీఠం నుంచి అమరీందర్ సింగ్ వైదొలగడానికి ప్రధాన కారణమైన సిద్ధూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Recommended Video

అంతర్గత కలహాలే కొంప ముంచాయంటూ
సీఎం క్యాండిడేట్ తనకు ప్రాబ్లమ్ లేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్ దారుణ పరాజయం దిశగా సాగుతుండటంతో సిద్ధూకు రాజీనామ ఒక్కటే మార్గంలా కనబడుతోంది. తాను రాజీనామా చేయబోతున్నట్లు సీఎల్పీకి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే, శుక్రవారం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన సీఎం చన్నీ..తన రాజీనామా నిర్ణయం ప్రకటించి..ఆ తరువాత గవర్నర్ ను కలవనున్నారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించటం లాంఛనంగా కనిపిస్తోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications