మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పు
ముంబై : మహారాష్ట్రలో నక్సల్స్ రెచ్చిపోయారు. ఒకేసారి పెద్దఎత్తున వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 27 వాహనాలు, యంత్రాలకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి.

ఇంత పెద్ద మొత్తంలో యంత్రాలు, వాహనాలు కాలి బూడిద కావడంతో కాంట్రాక్టర్ లబోదిబమంటున్నాడు. ఆస్తినష్టం తీవ్రంగా జరిగిందని వాపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇలాంటి ఘటన ఇది రెండోది. జనవరిలో కూడా ఇలాగే పలు వాహనాలకు నిప్పంటించారు నక్సల్స్. ఏప్రిల్ 11వ తేదీన గడ్చిరోలిలో నక్సల్స్ కు, సీఆర్పీఎఫ్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దానికి ప్రతిఘటనగా ఈ దాడులు చేశారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Maharashtra: Naxals have set ablaze 27 machines and vehicles at a road construction site in Kurkheda of Gadchiroli district. pic.twitter.com/62c6iNuJU2
— ANI (@ANI) May 1, 2019












Click it and Unblock the Notifications