వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరుకు కార్పొరేటర్, కార్యకర్తలతో కలిసి లూటీలు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర: కార్యకర్తలతో కలిసి లూటీలు, దోపిడీలు చేస్తున్న ఒక రాజకీయ నాయకుడి బండారం బయటపడింది. విచ్చలవిడిగా రెచ్చిపోయి దాడులు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. పోలీసులు సీసీ కెమెరాలలోని పుటేజులు స్వాదీనం చేసుకున్నారు.

మహారాష్ట్రలోని బాద్లాపూర్ కార్పొరేటర్ ఆష్ హిష్ దామ్లే మంగళవారం రాత్రి సుమారు 25 మంది అనుచరులతో కలిసి లింగాన్ గ్రామం సమీపంలోని ఆశ్రమంలోకి వెళ్లాడు. తరువాత కర్రలు, ఇనుపరాడ్ లు తీసుకుని హంగామా చేశాడు.

అదే సమయంలో ఆశ్రమంలో ఉన్న పూజారి రత్నాకర్ మహరాజ్ నిందితులను అడ్డుకున్నారు. తరువాత కార్పొరేటర్ ఆష్ హిష్ దామ్లే తుపాకి తీసుకుని పూజారి మీద దాడికి పాల్పడ్డాడు. ఆశ్రమంలో చేతికి చిక్కిన విలువైన వస్తువులు లూటీ చేశాడు.

NCP corporator Ashish Damle loots Rs 1 lakh

విషయం తెలుసుకున్న పోలీసు అధికారి గిరి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తరువాత అక్కడ ఎర్పాటు చేసిన సీసీ కెమెరాలలోని పుటేజ్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలలోని క్లిప్పింగ్ లు చూసి పోలీసులు షాక్ కు గురైనారు.

అందులో స్వయానా ప్రజాప్రతినిధి లూటీకి పాల్పడిన దృశ్యాలు గుర్తించారు. కార్పొరేటర్ ఆష్ హిష్ దామ్లే ఆశ్రమంలో ఉన్న రూ. ఒక లక్ష లూటీ చేశాడని అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎన్ సీపీ నాయకులు దామ్లే ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

English summary
NCP corporator Ashish Damle attacked the ashram and damaged its property, API P S Giri of Kulgaon Police Station said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X