అజిత్ పవార్‌పై బహిష్కరణ వేటు.. ధిక్కారంతో పార్టీ చర్యలు..

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్‌పై వేటు వేశారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అజిత్ వ్యవహరించారని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ చర్యలు తీసుకున్నారు. ఆయన నివాసంలో ఇప్పటికే ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ ప్రకటన చేసింది.

వేటు

వేటు

అజిత్ పవార్‌పై వేసిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు తమ దారిలోకి వస్తారని శరద్ పవార్ భావిస్తున్నారు. ఎన్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న అజత్ పవార్.. 22 నుంచి 35 మంది సభ్యులతో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. శనివారం ఉదయం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ కలకలం రేగింది. దీంతో పరిస్థితులను ఎన్సీపీ నిశీతంగా గమనిస్తోంది.

ఇదీ లెక్క

ఇదీ లెక్క

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు 145 సభ్యుల మద్దతు తప్పనిసరి. 105 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీకి.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతిచ్చారు. ఎన్సీపీకి 54 సభ్యులు ఉండగా.. 22 మంది నుంచి 35 మంది అజిత్‌తో కలిసి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరితోపాటు కొందరు శివసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాందాస్ అథవాలే పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేయనుండటంతో ఆ పార్టీ మెజార్టీ నిరూపణకు ఇబ్బందులు ఉండే పరిస్థితి లేదనిపిస్తోంది.

షాక్‌లో

షాక్‌లో

వాస్తవానికి శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. ఆ పార్టీ నేతలు శనివారం గవర్నర్ కొసియారిని కలుస్తామని ప్రకటించాయి. కానీ ఇంతలో బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. శివసేన రెండున్నరేళ్లు తమకు సీఎం పదవీ ఇవ్వమని బెట్టు చేయడంతో... ఆ పార్టీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేరీతిలో గుణపాఠం చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+