శరద్ పవార్ ఎన్సీపీ 45 మంది అభ్యర్థులతో తొలి జాబితా: అజిత్‌పై పవార్ మనవడు పోటీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 45 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. జయంత్ పాటిల్, అనిల్ దేశ్ ముఖ్, రాజేశ్ తోపే లాంటి కీలక నేతల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే, శరద్ పవార్, అజిత్ పవార్‌ల కుటుంబాల మధ్య మరోసారి పోటీ ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ బారామతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో దిగుతున్నారు. యుగేంద్ర పవార్ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి ఎంపీ సీటు నుంచి పోటీ కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో శరద్ పవార్ వర్గం నుంచి ఆయన కూతురు సుప్రియా సూలే పోటీ చేయగా.. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేశారు. అయితే, ఈ పోరులో సుప్రియా సూలే విజయం సాధించారు. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బారామతి అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి పవార్ కుటుంబసభ్యులే పోటీ పడుతుండటంతో ఆసక్తికరంగా మారింది.
कृपया प्रसिद्धीसाठी...
— Nationalist Congress Party - Sharadchandra Pawar (@NCPspeaks) October 24, 2024
राष्ट्रवादी काँग्रेस पार्टी- शरदचंद्र पवार पक्षाच्या संसदीय मंडळाने दिलेल्या मान्यतेनुसार महाराष्ट्र विधानसभा निवडणूक - २०२४ साठी पक्षाच्या अधिकृत उमेदवारांची विधानसभानिहाय पहिली यादी जाहीर करण्यात आली आहे. pic.twitter.com/MGEckJzGI3
కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన శరద్ పవార్ 1999లో ఎన్సీపీని స్థాపించారు. కాగా, గత ఏడాది జులై నెలలో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ బయటికి రావడంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఎన్సీపీ శరద్ పవార్, ఎన్సీపీ అజిత్ పవార్ గా ఏర్పడ్డాయి. అజిత్ పవార్ బీజేపీ కూటమిలో చేరి.. మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం అజిత్ పవార్ బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేనతో కలిసి మహాయతి కూటమిలో ఉన్నారు. మరోవైపు, అజిత్ పవార్ ఎన్సీపీ.. ఉద్ధవ్ థాక్రే శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉన్నారు.
మహా వికాస్ అఘాడీ కూటమిలోని ఈ మూడు పార్టీలో చెరో 85 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 45 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసి శరద్ పవార్ ఎన్సీపీ. కాగా, మహారాష్ట్రలో నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications