విపక్షాల ఆందోళన, కాంగ్రెస్ పట్టు: లోక్‌సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: విపక్షసభ్యుల గందరగోళం మధ్య లోకసభ బుధవారానికి వాయిదాపడింది. తొలుత ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమైంది. కానీ నిమిషాల్లోనే సభ గంట పాటు వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి పన్నెండు గంటలకు సభ ప్రారంభమైంది.
ఓ వైపు అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు అంశంపై సభలో నిరసన వ్యక్తం చేశారు. వెల్‌లోకి చొచ్చుకెళ్లి నిరసన తెలిపారు. తమ డిమాండు పరిశీలించాలన్నారు. మరోవైపు, అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చర్చకు పలువురు మద్దతిస్తున్నారని చెప్పారు.

ఖర్గే డిమాండ్, పలువురు ఎంపీల మద్దతు
విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అవిశ్వాస తీర్మానంపై పట్టుబట్టారు. ఆయన లేచి నిలబడినప్పుడు పలువురు ఎంపీలు మద్దతుగా లేచి నిలబడ్డారు. అంతకుముందే స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాసం నోటీసులు చదివి వినిపించారు. విపక్షాలు కొన్ని వెల్లోకి, మరికొన్ని అక్కడే ఉండి నిరసనలు తెలిపాయి. సభలో గందరగోళం చోటు చేసుకోవడంతో సభ సజావుగా లేదంటూ స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications