Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్: ఎవరీయన? వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి..

న్యూఢిల్లీ: ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌​ను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జగదీప్ ధన్‌కర్‌ మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని ఎంపిక సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రజల గవర్నర్‌​గా పేరు సంపాదించారని కొనిడాయారు. నవభారత్ స్ఫూర్తికి ఆయన జీవితం అద్దం పడుతుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఆర్థిక, సామాజికపరమైన అనేక అడ్డంకులు, అవాంతరాలు అధిగమించి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని వివరించారు.

ఎవరీ జగదీప్ ధన్‌కర్?: సుప్రీంకోర్టు లాయర్‌గానూ సేవలు

ఎవరీ జగదీప్ ధన్‌కర్?: సుప్రీంకోర్టు లాయర్‌గానూ సేవలు

రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ధన్‌ఖర్. చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, అతను రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. మొదటి తరం ప్రొఫెషనల్ అయినప్పటికీ, అతను రాష్ట్రంలోని ప్రముఖ న్యాయవాదులలో ఒకరిగా నిలిచాడు. ధంఖర్ రాజస్థాన్ హైకోర్టు, భారత సుప్రీంకోర్టు రెండింటిలోనూ ప్రాక్టీస్ చేశారు.

ఎంపీగా, కేంద్రమంత్రిగా ధన్‌కర్

ఎంపీగా, కేంద్రమంత్రిగా ధన్‌కర్

తొలిసారిగా 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును నుంచి పార్లమెంటు సభ్యుడిగా (ఎంపీ) ఎన్నికైన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1990లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ధన్‌ఖర్ ఎన్నికయ్యారు.

ప్రజల గవర్నర్‌గా జగదీప్ ధన్‌కర్

ప్రజల గవర్నర్‌గా జగదీప్ ధన్‌కర్

ఆ తరువాత, జూలై 2019లో, జగదీప్ ధన్‌కర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించబడ్డారు. గవర్నర్‌గా ఉన్న సమయంలో అనేకమార్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు జగదీప్ ధన్‌కర్. దీంతోనే ఆయనను ప్రజల గవర్నర్ అంటూ నడ్డా కొనియాడారు. దేశ తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఆ పదవికి నామినేషన్ వేయడానికి జూలై 19 చివరి తేదీ అని గమనించాలి. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే, ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+