నీట్ ఫలితాలు వాయిదా: సుప్రీంకోర్టులో కేంద్రం: రెండో దఫా మళ్లీ ఎగ్జామ్స్: రిజల్ట్స్ ఎప్పుడంటే?

న్యూఢిల్లీ: లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈ ప్రవేశ పరీక్షా ఫలితాలను ఎప్పుడు వెల్లడిస్తామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఙప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఫలితాలను వాయిదా వేయడానికి అనుమతి ఇచ్చింది.

దీనితో సోమవారం వెల్లడి కావాల్సిన ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈ నెల 16వ తేదీన నీట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి. నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను వాయిదా వేయడానికి గల కారణాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ..పరీక్షలను రాయలేకపోయిన అభ్యర్థుల కోసం రెండో విడత నీట్ పరీక్షలను నిర్వహించబోతోంది. బుధవారం దేశవ్యాప్తంగా నీట్ రెండో విడత పరీక్షలను కేంద్రం నిర్వహించబోతోంది.

Neet Result 2020: results to be out on October 16, Union government tells SC

కరోనా పాజిటివ్ అభ్యర్థులతో పాటు కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో ఉన్న వారు కూడా నీట్ పరీక్షలను రాయలేకపోయారని, వారి విజ్ఙప్తి మేరకు బుధవారం రెండో విడతలో నీట్ పరీక్షలను నిర్వహించబోతున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 14న పరీక్ష రాయగా.. 16వ తేదీన ఫలితాలను వెల్లడిస్తామని వెల్లడించింది. దీనితో అభ్యర్థులు మరో నాలుగు రోజుల పాటు ప్రవేశ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+