వైద్యుల నిర్లక్ష్యం... కూరగాయల బండిపై ప్రసవించిన మహిళ...
పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణి పట్ల డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆ మహిళ ఆరుబయటే కూరగాయల బండిపై ప్రసవించింది. ఈ దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఈ సంఘటన హర్యానాలోని అంబాలా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. పంజాబ్‌లోని మొహాలీ జిల్లా దపార్‌కు చెందిన వ్యక్తి తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో అంబాలా జిల్లా ఆస్పత్రికి తరలించాడు. కానీ, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్‌ను కూడా ఇవ్వలేదు ఆసుపత్రి సిబ్బంది. సహాయం కోసం ఆమె భర్త ప్రాధేయపడినా డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఏం చేయాలో తోచక ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ మహిళ ఆసుపత్రి గేటు సమీపంలోనే కూరగాయాల బండిపై ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి : ఈ విషయం కాస్త ఆ నోటా ఈ నోటా పాకి చివరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి చేరింది. ఆసుపత్రి సిబ్బందిపై, వైద్యులపై సమగ్ర విచారణ జరిపి దోషులను వెంటనే శిక్షిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది తల్లీబిడ్డను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లీ వార్డులో ఉంచారు. ఈ సంఘటనపై ఆ మహిళ భర్త ఈ విధంగా మాట్లాడరు. ఆసుపత్రిలోని వైద్యులను సిబ్బందిని దేవుడి భావించాను. కానీ, ఈ సంఘటనతో ఆసుప్రతి సిబ్బందిపై నాకు నమ్మకం పోయింది. నా భార్యపిల్లలను కాపాడింది మాత్రం దేవుడే అంటూ తన గోడును వెల్లబుచ్చాడు. మేము అంబులెన్స్‌లు, ఉచిత డెలివరీ సేవలను కూడా అందిస్తున్నాం. కాబట్టి ఆ కుటుంబానికి తగిన సాయం అందిందా లేదా అనే ప్రతి అంశాన్ని దర్యాప్తు చేశాను. ఈ విషయం పై ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా, సహించేది లేదు. తప్పకుండా చర్య తీసుకుంటాం అరి రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి అంటున్నారు. అనంతరం ఈ విషయంపై విచారణకు ఓ కమిటీని కూడా ఏర్పాట్లు చేసినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications