నెహ్రూపై సీడీఎస్ అనిల్ చౌహాన్ షాకింగ్-టిబెట్ ను చైనాకిచ్చి, పంచశీల..!

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అప్పట్లో టిబెట్ ను చైనాకు ఇచ్చేసి పంచశీల ఒప్పందం కుదుర్చకున్నా ఇప్పటికీ ఆ దేశంతో మనకు సరిహద్దు సమస్యలు కొనసాగుతుండటంపై సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలుచేశారు.

భారత్-చైనా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై సాయుధ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్వాతంత్ర్యం తర్వాత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (jawahar lal nehru) టిబెట్ (Tibet)ను చైనా(china)కు ఎందుకు ఇచ్చేశారో, అప్పట్లో కుదిరిన పంచశీల ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉన్నా సరిహద్దు వివాదాలు ఎందుకు పరిష్కారం కావడం లేదో అన్న అంశాలపై సీడీఎస్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

1954లో భారత్ టిబెట్‌ను చైనాలో భాగంగా గుర్తించిందని, ఇరు పొరుగు దేశాలూ పంచశీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ ఇవాళ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. ఈ ఒప్పందం ఏదో ఒక విధంగా ఉత్తర సరిహద్దు వివాదాన్ని లాంఛనప్రాయంగా పరిష్కరించినట్లు భారత్ ఆ రోజుల్లో భావించిందని, అయితే చైనా మాత్రం ఇది కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే కుదిరిందని తేల్చేసిందన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యం కోసమే చేసుకున్నారు తప్ప, సరిహద్దుపై చైనా వైఖరిని ఏమాత్రం ప్రతిబింబించలేదన్నారు.

Nehru Gave Tibet to China CDS General Chauhan s Claim Unpacks the Real Reason for Panchsheel

బ్రిటీష్ వారు వెళ్లిపోయాక, తమ సరిహద్దు ఎక్కడ ఉందో భారతదేశం నిర్ణయించుకోవాల్సిందని, తూర్పున మనకు మెక్‌మోహన్ లైన్ లాంటిది ఒకటి ఉందని నెహ్రూకు బహుశా తెలుసని, లడఖ్ ప్రాంతంలో కూడా మనకు ఏదో ఒక సమస్య ఉందని ఆయనకు తెలుసని, అందుకే బహుశా ఆయన పంచశీల ఒప్పందాన్ని కోరుకున్నారని సీడీఎస్ తెలిపారు. దాదాపు 890 కిలోమీటర్ల పొడవైన మెక్‌మోహన్ లైన్ తూర్పున బ్రిటిష్ ఇండియా, టిబెట్‌ల సరిహద్దుగా ఉండేదని, చైనా తన టిబెట్ విముక్తి తర్వాత ఆ ప్రాంతంలోకి ప్రవేశించడంతో పాటు స్థిరత్వాన్ని కోరుకుందన్నారు.

Nehru Gave Tibet to China CDS General Chauhan s Claim Unpacks the Real Reason for Panchsheel

స్వతంత్ర భారతదేశం చైనాతో మంచి సంబంధాలను పెంచుకోవడానికి తీవ్రంగా ఆసక్తిగా ఉండేదని, 1949లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత, అది తన ప్రదేశాల కోసం ఎలాంటి వాదనలు చేయలేదని సీడీఎస్ తెలిపారు. బ్రిటిష్ వారి నుండి వారసత్వంగా పొందిన ప్రత్యేక హక్కులను కూడా వదులుకుందన్నారు. కానీ టిబెట్‌ను ఆక్రమించుకున్నాక ఐరాసలో చైనాకు శాశ్వత సభ్యత్వం లభించడాన్ని భారత్ గుర్తించిన కారణంగా భారత్-టిబెట్ మధ్య ఉన్న 'హిమాలయ బఫర్' కనుమరుగైందని జనరల్ చౌహాన్ తెలిపారు. అప్పటి నుంచి ఇది సరిహద్దు వివాదంగా మారిందన్నారు. పంచశీల ఒప్పందానికి సరిహద్దుల అంశంపై తమ వైఖరితో ఎటువంటి సంబంధం లేదని చైనా మరోసారి తేల్చేసిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+