ఓరి నీయంకమ్మ, 10 అంగుళాల భూమికోసం ఢిష్యూం ఢిష్యూం, క్లైమాక్స్ లో శవం !

కోలారు/ బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో హత్యలు, దారి దోపిడీలు, బెదిరింపులు సర్వసాధారణమైపోయాయని ఆరోపణలు ఉన్నాయి, చిన్న చిన్న కారణాలతో హత్య కేసులు రోజురోజుకూ నమోదవుతున్నాయి. చిన్నాచితకా కారణాలతో హత్యల కేసుల వరుసలో ఇంకా ఇలాంటి కేసులు కొన్ని అదనంగా తయారైనాయి.10 అంగుళాల స్థలం విషయంలో గొడవ జరగడంతో చివరికి ఒకరి హత్యతో తగాదాగాలు ముగిశాయి..

కర్ణాటకలోని కోలార్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.దురదృష్టవశాత్తు ప్రత్యర్థుల దాడిలో ముజుమిల్ పాషా చనిపోయాడు. ముజుమిల్ పాషా కోలారు పట్టణంలోని ఇద్రిస్ సాబ్ నగర్ లో ముజామిల్ పాషా నివాసం ఉంటున్నాడు. ముజుమిల్ పాషా తండ్రి ఇంటి నిర్మాణ సమయంలో పక్కింటి వైపు ఉన్న జాగాలో కేవలం 10 అంగుళాల కిటికీ, దాని మీద స్లాబ్ నిర్మించాడు.

Neighbors beat a young man to death in a fight over 10 inches of space in Kolar

దీంతో పక్కింటిలో నివాసం ఉంటున్న వారికి ముజామిల్ పాషా తండ్రికి వాగ్వాదం జరిగింది. కిటికీ నిర్మాణం వల్ల మేము ఇంటి ముందు సంచరించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇరుగుపొరుగున నివాసం ఉంటున్న రోషన్, నబీవుల్లా, జమీర్, ఫిర్దోస్ తదితరులు ముజామిల్ పాషా తండ్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో వాదించారు.

మొదట ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత గొడవలు తారాస్థాయికి చేరిపోవడంతో పరస్పరం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో నిందితులు ముజుమిల్ పాషాపై దాడి చేయడంతో అతనికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే ముజామిల్ పాషాను ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే తీవ్రగాయాలైన ముజామిల్ పాషా మృతి చెందాడని పోలీసులు అన్నారు. ముజామిల్ పాషా చనిపోయాడని తెలుసుకున్న నిందితులు వారి కుటుంబ సభ్యులతో కలిసి అదృశ్యం అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కోలారు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కేవలం పది అంగుళాల భూమి కోసం ఓ వ్యక్తిని హత్య చేసి పారిపోయిన నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+